తదుపరి వార్తా కథనం
AUS vs SA: మూడో వన్డేలో దక్షిణాఫ్రికా ఆలౌట్.. టీమిండియా టార్గెట్ ఎంతంటే?
వ్రాసిన వారు
Jayachandra Akuri
Dec 06, 2025
05:22 pm
ఈ వార్తాకథనం ఏంటి
కీలకమైన మూడో వన్డేలో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ ముగిసింది. టాస్‌లో ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన సఫారీలు 47.5 ఓవర్లలో 270 పరుగులకు ఆలౌట్ అయ్యారు. ఓపెనర్ క్వింటన్ డికాక్ (106) శతకంతో జట్టును నిలబెట్టాడు. కెప్టెన్ బవుమా (48) మినహా ఇతర బ్యాటర్లు పెద్దగా ప్రతిభ కనబరచలేదు. భారత్ బౌలర్లలో కుల్‌దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ తలా 4 వికెట్లు తీసి దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌ను కట్టడి చేశారు. ఆర్ష్‌దీప్ సింగ్, రవీంద్ర జడేజా చెరో ఒక్క వికెట్ దక్కించుకున్నారు.