
Matthew Breitzke: అరంగేట్రం నుంచి నాలుగు వరుస మ్యాచుల్లో 50+ స్కోర్లు!
ఈ వార్తాకథనం ఏంటి
సౌత్ ఆఫ్రికా బ్యాటర్ మాథ్యూ బ్రీట్జ్‌కే అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం సౌతాఫ్రికా, ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్ ఆడుతోంది. అందులో రెండో మ్యాచ్‌లో అతను 78 బంతుల్లో 88 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతను ఎనిమిది ఫోర్లు, రెండు సిక్స్‌లు కొట్టాడు. ఇదే దూకుడు మీద సెంచరీ చేసేలా కనిపించినా.. నాథన్ ఎల్లిస్ బౌలింగ్‌లో చివరికి వెనుదిరిగాడు. దీంతో మాథ్యూ బ్రీట్జ్‌కే తన అరంగేట్రం నుంచి వరుసగా నాలుగు మ్యాచుల్లో 50+ స్కోర్లు సాధించిన బ్యాటర్‌గా నిలిచాడు. విశేషం ఏమిటంటే, ఇవి మూడు వేర్వేరు ప్రత్యర్థి జట్ల మీద కావడం విశేషం. ఈ నాలుగు ఇన్నింగ్స్‌లో తొలి మ్యాచ్‌లోనే సెంచరీ రికార్డు నమోదు అయ్యింది.
వివరాలు
నవజ్యోత్ సింగ్ సిద్ధూ సాధించిన నాలుగు హాఫ్ సెంచరీలతో పోలిస్తే ప్రత్యేకం
ఇది టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూకి (Navjot Singh Sidhu) కెరీర్ ప్రారంభంలో సాధించిన నాలుగు హాఫ్ సెంచరీలతో పోలిస్తే ప్రత్యేకం. సిద్ధూ నాలుగు హాఫ్ సెంచరీలను ఐదు మ్యాచుల్లో సాధించగా, మాథ్యూ బ్రీట్జ్‌కే ఇదే ఘనతను నాలుగు వరుస మ్యాచుల్లో సాధించాడు. అలాగే మాథ్యూ బ్రీట్జ్‌కే 2025 ఐపీఎల్‌లో కూడా అరంగేట్రం చేశాడు. లఖ్నౌ సూపర్ జెయింట్స్ తరఫున తన తొలి మ్యాచ్ ఆడిన ఈ బ్యాటర్ అద్భుత ప్రదర్శనతో అభిమానులను మంత్రముగ్ధులుగా చేశాడు.
వివరాలు
తొలి నాలుగు వన్డే మ్యాచుల్లో బ్రీట్జ్‌కే స్కోర్లు
150(148) vs న్యూజిలాండ్ 83(84) vs పాకిస్థాన్ 57(56) vs ఆస్ట్రేలియా 88(78) vs ఆస్ట్రేలియా