SA vs AFG: సౌతాఫ్రికా విజయం.. సెమీస్ నుంచి ఆప్ఘనిస్తాన్ ఔట్
వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా ఇవాల సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచులో ఆఫ్ఘాన్ పై సౌతాఫ్రికా ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే భారీ తేడాతో నెగ్గాల్సిన మ్యాచులో అఫ్ఘనిస్తాన్ చేతులేత్తేసింది. ఆఫ్ఘాన్ టాపార్డర్ బ్యాటర్లు విఫలం కావడంతో నిర్ణీత 50 ఓవర్లలో 244 పరుగులు చేసి ఆలౌటైంది. ఆల్ రౌండర్ అజ్ముతుల్లా 97* ఒక్కరే నాటౌట్‌గా నిలిచి ఆప్ఘాన్ జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించాడు. సౌతాఫ్రికా బౌలర్లలో గెరాల్డ్ కోయెట్జీ నాలుగు వికెట్లతో చెలరేగగా, మహరాజ్, నిగిడి తలా రెండు వికెట్లు
రాణించిన రాస్సీ వాన్ డెర్ డస్సెన్
245 పరుగుల లక్ష్య చేధనకు దిగిన సౌతాఫ్రికా బ్యాటర్లు కొంచెం తడబడ్డారు. లక్ష్యం చిన్నదైనా గెలవడానికి శ్రమించాల్సి వచ్చింది. ఓపెనర్ క్వింటాన్ డికాక్ 41, కెప్టెన్ బవుమా 23, అడం మార్కామ్ 25 రన్స్ చేశారు. ఇక రాస్సీ వాన్ డెర్ డస్సెన్ (80*), ఆండిలే ఫెహ్లుక్వాయో (39*) చివరి క్రీజులో ఉండి సౌత్ ఆఫ్రికా జట్టుకు విజయాన్ని అందించాడు. దీంతో సౌతాఫ్రికా 47.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో రషీద్ ఖాన్ 2, మహ్మద్ నబీ 2, ముజీబ్ రెహ్మన్ ఒక వికెట్ తీశారు.