PAK VS SA : తుస్సుమన్న పాక్ బ్యాటర్లు.. పోరాడి ఓడిన పాక్, సఫారీలదే అగ్రస్థానం
వన్డే వరల్డ్ కప్ 2023లో పాకిస్థాన్ పోరాడి ఓటమిపాలైంది. ఈమేరకు పాక్ బ్యాట్స్ మెన్లు మరోసారి చేతులెత్తేశారు. చెన్నై వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన కీలక పోరులో చావోరేవో తెల్చుకోవాల్సిన పరిస్థితిలో పాక్ ఓడిపోయింది. ఫలితంగా మెగా టోర్నీ నుంచి దాదాపుగా నిష్క్రమించినట్టే. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 46.4 ఓవర్లలో 270 పరుగులకు ఆలౌటైంది. సౌద్ షకీల్ (52 బంతుల్లో 52; 7 ఫోర్లు), బాబర్ ఆజమ్ (65 బంతుల్లో 50; 4 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీలతో చెప్పుకోదగ్గ స్కోరు సాధించారు. చివర్లో షాదాబ్ ఖాన్ (36 బంతుల్లో 43; 3 ఫోర్లు,2 సిక్సర్లు) పుంజుకోవడంతో గౌరవప్రదమైన స్కోరును చేయగలిగింది. ఇటు దక్షిణాఫ్రికా బౌలర్లలో షమ్సీ 4 వికెట్లతో పాక్ నడ్డివిరిచాడు.
9 వికెట్లు కోల్పోయి విజయ సాధించిన దక్షిణాఫ్రికా
మార్కో యాన్సెన్ 3 వికెట్లు, కొట్జీకి 2 వికెట్లు తీశారు. దక్షిణాఫ్రికా బ్యాటింగ్ : 271 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన దక్షిణాఫ్రికా ఓపెనర్లు ఆశించిన శుభారంభం ఇవ్వలేకపోయారు. సౌత్ ఆఫ్రికా టాప్ ఆర్డర్ తక్కువ స్కోరుకే పెవిలియన్ బాట పట్టారు. దీంతో జట్టు భారం స్టార్ బ్యాటర్ ఐడెన్ మార్క్‌రమ్ పై పడింది. 93 బంతుల్లో 91 పరుగులను రాబట్టాడు.టాప్ నుంచి మిడిల్ ఆర్డర్ బ్యాటర్ల వరకు అంతా 20 వరకే పరుగులు చేశారు. చివర్లో కేశవ్ మహరాజ్, లుంగిడి దక్షిణాఫ్రికాకు విజయం చేకూర్చారు. 47.2ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 271 పరుగులతో సఫారీ జట్టు విజయతీరాలకు చేరింది.అఫ్రిదీ 3 వికెట్లు, రౌఫ్, వసీమ్, ఉసమా మిరీ 2 చొప్పున వికెట్లు సాధించారు.