Aus Vs SA Semifinal : టాస్ గెలిచిన సౌతాఫ్రికా.. తుది జట్లు ఇవే!
వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా రెండో సెమీస్‌లో ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా జట్లు తలపడనున్నాయి. కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా మరికాసేపట్లో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన సౌతాఫ్రికా మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. వరల్డ్ కప్‌లలో నాకౌట్ ఫోబియాను సౌత్ ఆఫ్రికా అధిగమించి తొలిసారి ఫైనల్ చేరుతుందో లేదో వేచి చూడాలి. మరోసారి ఫైనల్ కు చేరి టైటిల్‌ను ఎగరేసుకొని పోవాలని ఆసీస్ భావిస్తోంది. ఈ మ్యాచులో సౌతాఫ్రికా ఒక మార్పును చేయగా, ఆస్ట్రేలియా రెండు మార్పులను చేసింది.
ఇరు జట్లలోని సభ్యులు వీరే
ఆస్ట్రేలియా జట్టు ట్రావిస్ హెడ్, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్, మార్నస్ లాబుషాగ్నే, గ్లెన్ మాక్స్‌వెల్, జోష్ ఇంగ్లిస్(w), పాట్ కమిన్స్(c), మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్ దక్షిణాఫ్రికా జట్టు క్వింటన్ డి కాక్(w), టెంబా బావుమా(c), రాస్సీ వాన్ డెర్ డుసెన్, ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, గెరాల్డ్ కోయెట్జీ, కగిసో రబడ, తబ్రైజ్ షమ్సీ