అంతర్జాతీయ రిటైర్మెంట్ ప్రకటించిన సెర్గియో రామోస్
స్పానిష్ స్టార్ ఆటగాడు సెర్గియో రామోస్ గురువారం తన అంతర్జాతీయ కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. రామోస్ 2010 FIFA ప్రపంచ కప్, 2008, 2012లో యూరోపియన్ ఛాంపియన్ షిప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. 2005లో అరంగేట్రం చేసిన సెర్గియో రామోస్ అత్యధిక క్యాప్‌లు సాధించిన ఆటగాడి చరిత్రకెక్కాడు. రామోస్ గత రెండేళ్లుగా స్పెయిన్ తరఫున ఆడలేదు. స్పెయిన్ తరుపున 2013లో 100 క్యాప్‌లు సాధించిన అత్యంత పిన్న వయస్కుడైన ఆటగాడిగా నిలిచాడు. ప్రస్తుతం స్పెయిన్ ఫుట్‌బాల్ జట్టు తరుపున అత్యధికంగా 180 మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు.
అత్యధిక విజయాలు అందించిన అటగాడిగా రామోస్
తాను స్పెయిన్ జాతీయ జట్టుకు వీడ్కోలు చెప్పే సమయం వచ్చిందని ప్రస్తుత ప్రధాన కోచ్ నుండి తనకు కాల్ వచ్చినప్పుడు తాను రిటైర్మెంట్ గురించి మాట్లాడానని రామోస్ తెలిపారు. బరువైన హృదయంతో తాను తప్పుకుంటున్నానని తాను సాధించిన విజయాలన్నీ ఎంతో సంతృప్తినిచ్చాయని రామోస్ వెల్లడించారు. అదే విధంగా సెర్గియో రామోస్ స్పెయిన్ తరఫున అత్యధికంగా 131 విజయాలు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. రామోస్ నాలుగు ప్రపంచ కప్‌లు, మూడు యూరోపియన్ ఛాంపియన్‌షిప్‌లలో స్పెయిన్‌కు ప్రాతినిధ్యం వహించాడు.