FIFA World Cup 2023 : స్వీడన్‌కు షాక్.. చరిత్ర సృష్టించిన స్పెయిన్ మహిళల జట్టు
ఫిఫా మహిళల వరల్డ్ కప్‌లో మరో సరికొత్త రికార్డు నమోదైంది. చరిత్రలో మొదటిసారిగా స్పెయిన్ మహిళల జట్టు ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్లో అడుగుపెట్టింది. టోర్నీ ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన స్పెయిన్ మహిళలు స్వీడన్‌ను ఓడించారు. మంగళవారం ఈ రెండు జట్ల మధ్య జరిగిన సెమీ ఫైనల్లో స్వీడన్ పై 2-1 తేడాతో స్పెయిన్ విజయం సాధించింది. ఓల్గా కార్మోనా 90వ నిమిషంలో విన్నింగ్ గోల్ కొట్టడంతో స్పెయిన్ ఆటగాళ్ల సంబరాలు మిన్నంటాయి. రేపు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ విజేతతో ఫైనల్లో స్పెయిన్ జట్టు తలపడనుంది.
జట్టుకు అపూర్వమైన విజయాన్ని అందించిన ఒల్గా కర్మోనా
ఈడెన్ పార్క్ లో మంగళవారం స్పెయిన్, స్వీడన్ జట్లు ఫైనల్ బెర్తు కోసం హోరాహోరీగా తలపడ్డాయి. క్వార్టర్ ఫైనల్లో నెదర్లాండ్ పై రాణించిన సల్మా పారుల్లులో 81 నిమిషంలో గోల్ చేయడంతో స్పెయిన్ 1-0 ఆధిక్యంలో వెళ్లింది. 88వ నిమిషంలో స్వీడన్ ప్లేయర్ రెబెక్కా బ్లొంక్విస్ట్ గోల్ కట్టి స్కోరును సమం చేసింది. పెనాల్లీ షూటౌట్ ఉంటుందని అనుకున్నా ఒల్గా కర్గోనా 90వ నిమిషంలో గోల్ కొట్టి స్పెయిన్ జట్టుకు అపూర్వమైన విజయాన్ని అందించింది. దీంతో స్వీడన్ ఆటగాళ్ల కన్నీటిపర్వంతమయ్యారు.