Ronald : ఇన్ స్టాగ్రామ్లో సరికొత్త రికార్డు సృష్టించిన క్రిస్టియానో రోనాల్డ్
పోర్చుగల్ ఫుట్ బాల్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డ్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తన ఆట తీరుతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో అతని ఫాలోయర్ల సంఖ్య చూస్తే మతిపోవాల్సిందే. ప్రపంచలో ఏ వ్యక్తికి ఇంతమంది ఫాలోవర్లు లేరని చెప్పొచ్చు. ఇన్ స్టాగ్రామ్లో గతేడాది 50 కోట్ల మంది ఫాలోవర్లు ఉండగా.. తాజాగా ఆ సంఖ్య 60 కోట్లకు చేరింది. ఆల్ టైమ్ గ్రేటెస్ట్ ఫుట్ బాల్ ఫ్లేయర్స్లో ఒకడిగా పేరుగాంచిన రోనాల్డ్ రిటైర్మెంట్ కు దగ్గరపడుతున్నా అతని క్రేజ్ మాత్రం ఇసుమంత కూడా తగ్గడం లేదు. గతేడాది మే నెల నుంచి ఇప్పటివరకు అతని ఫాలోవర్ల సంఖ్య ఏకంగా 15 కోట్ల వరకు పెరిగింది.
రోనాల్డ్ తర్వాతి స్థానంలో మెస్సీ
ఇన్ స్టాగ్రామ్ లో రోనాల్డ్ చాలా యాక్టివ్ ఉంటాడు. అయితే 14 నెలల్లోనే 34శాతం మంది ఫాలోవర్లు పెరిగారని సోషల్ బ్లేడ్ సర్వే ప్రకటించింది. ప్రస్తుతం రోనాల్డ్ సౌదీ క్లబ్ అల్ నసర్ తరుఫున ఫార్వర్డ్ ప్లేయర్గా ఆడుతున్నారు. రోనాల్డ్ ఇన్ స్టాలో చేసే ఒక్కో పోస్టుకు సూమారు 28 లక్షల డాలర్లు అంటే 19 కోట్లు వరకు సంపాదిస్తుండడం విశేషం. ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకారం ప్రస్తుతం రొనాల్డ్ ఆస్తుల విలువ రూ. 4100 కోట్లుగా ఉంది. 2023లో ప్రపంచంలో అత్యధికంగా సంపాదించిన అథ్లెట్ గా రొనాల్డ్ గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించిన విషయం తెలిసిందే ఇన్స్టాగ్రామ్లో రోనాల్డ్ తర్వాత అర్జెంటీనా స్టార్ లియోనల్ మెస్సీ 48.2 కోట్ల ఫాలోవర్లతో రెండోస్థానంలో నిలిచారు.