LOADING...
Airport: ప్రతికూల వాతావరణ పరిస్థితులు దృష్ట్యా..శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి విమానాల దారి మళ్లింపు
శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి విమానాల దారి మళ్లింపు

Airport: ప్రతికూల వాతావరణ పరిస్థితులు దృష్ట్యా..శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి విమానాల దారి మళ్లింపు

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 02, 2025
12:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

శంషాబాద్‌ విమానాశ్రయంలో మంగళవారం అర్ధరాత్రి సమయంలో ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఏర్పడినట్లు సమాచారం. వర్షం,గాలులు,దట్టమైన మేఘాలు ల్యాండింగ్‌కు అనుకూలంగా లేకపోవడంతో పలువురు ప్రయాణికుల రాకపోకలపై ప్రభావం పడింది. ఈవాతావరణం కారణంగా,విమానాశ్రయ అధికారులు కొన్ని విమానాలను ఇతర నగరాల వైపు దారి మళ్లించాల్సి వచ్చింది. ముఖ్యంగా లఖ్‌నవూ,కోల్‌కతా,ముంబయి,జయపుర వంటి నగరాల నుంచి హైదరాబాద్ కు వస్తున్న విమానాలను బెంగళూరుకు డైవర్ట్‌ చేశారు. అలాగే,బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు బయలుదేరిన మరో విమానాన్ని విజయవాడకు మళ్లించారు. అయితే బుధవారం ఉదయం వాతావరణం క్రమంగా మెరుగుపడటంతో,పూర్వపు షెడ్యూల్‌కు అనుగుణంగా అన్ని విమానాలూ తిరిగి శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నాయి. ప్రస్తుతం విమానాశ్రయంలో కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరాయని,ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సేవలు అందుతున్నాయని విమానాశ్రయ అధికారులు స్పష్టం చేశారు.