
మరో అరుదైన ఘనతను చేరుకోనున్న ఫుట్‌బాల్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో
ఈ వార్తాకథనం ఏంటి
పోర్చుగల్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన కెరీర్‌లో ఎన్నో రికార్డులను సాధించి ఫుట్ బాల్ స్టార్ ప్లేయర్‌గా కొనసాగుతున్నాడు.
తాజాగా క్రిస్టియానో రొనాల్డో మరో అరుదైన ఘనతకు చేరవయ్యాడు. ఇప్పటికే అంతర్జాతీయ ఫుట్ బాల్ పురుషుల విభాగంలో అత్యధిక మ్యాచులు(199) ఆడిన ప్లేయర్‌గా రొనాల్డో మొదటి స్థానంలో ఉన్నాడు.
తాజాగా యూరో 2024 క్వాలిఫైయింగ్ లో తన 200వ అంతర్జాతీయ మ్యాచ్ ద్వారా మరో రికార్డుపై రొనాల్డో కన్నేశాడు. మ్యాచ్ కు ముందు రోనాల్డో కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
తాను ఇక్కడికి రావడాన్ని ఎప్పటికి మర్చిపోలేనని, 200వ అంతర్జాతీయ మ్యాచుకు చేరుకోవడం అంటే తన జట్టుపై తనకు ఉన్న ప్రేమను చూపుతుందని అతను స్పష్టం చేశారు.
Details
అత్యధిక అంతర్జాతీయ మ్యాచులు ఆడిన జాబితాలో రొనాల్డో మొదటిస్థానం
ఈ ఏడాది పోర్చుగల్ కోచ్‌గా రాబర్టో మార్టినెజ్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి రొనాల్డో మూడు మ్యాచుల్లో నాలుగు గోల్స్ కొట్టడం విశేషం.
పురుషుల విభాగంలో అత్యధిక అంతర్జాతీయ మ్యాచులు ఆడిన ఆటగాళ్ల జాబితాలో రొనాల్డ్ మొదటి స్థానంలో ఉన్నాడు.
తర్వాతి స్థానంలో బాదర్ అల్-ముతావా 196 మ్యాచులతో రెండో స్థానంలో ఉన్నాడు. కాబటి చినఅన్(మలేషియా) 195 అంతర్జాతీయ మ్యాచులతో మూడో స్థానంలో ఉన్నాడు.
లియోనల్ మెస్సీ (అర్జెంటీనా) 175, సునీల్ ఛెత్రీ (భారత్) 137 అంతర్జాతీయ మ్యాచులు ఆడారు.