Sreesanth: కివీస్ మాజీ క్రికెటర్‌కు దిమ్మతిరిగే రిప్లై ఇచ్చిన శ్రీశాంత్
మరో వారం రోజుల్లో వన్డే వరల్డ్ కప్ 2023 సమరం ప్రారంభ కానుంది. భారత్ వేదికగా జరిగే ఈ మెగా టోర్నీ ఆడటానికి ఇప్పటికే చాలా దేశాలు ఇండియాకు చేరుకున్నాయి. వరల్డ్ కప్ ప్రారంభానికి ముందే మాజీల మధ్య మాటల యుద్ధానికి తెరలేచింది. తాజాగా టీమిండియా ప్రదర్శనపై న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ సైమన్ డౌల్ చేసిన చేసిన వ్యాఖ్యలపై భారత మాజీ సీమర్ శ్రీశాంత్ దిమ్మతిరిగే రిప్లై ఇచ్చాడు. పెద్ద టోర్నీలో భారత్ దూకుడుగా ఆడలేదని సైమన్ ఇటీవల పేర్కొన్నాడు. అయితే ఇలాంటి మాటలు విరాట్ కోహ్లీ చెవినపడితే మీ పని అంతేనని శ్రీశాంత్ గట్టిగా బదులిచ్చాడు.
ఈసారి పోటీ రసవత్తరంగా ఉంటుంది
వరల్డ్ కప్ ఆడేందుకు న్యూజిలాండ్ జట్టు భారత్‌కు వస్తోందని, తప్పకుండా ఆ జట్టును టీమిండియా చిత్తు చేసిందని శ్రీశాంత్ పేర్కొన్నారు. 2019లో లక్కీగా న్యూజిలాండ్ ఫైనల్‌కు చేరుకుందని, అయితే సెమీస్‌లో ధోని రనౌట్ కావడం వల్లే అది సాధ్యమైందని, అయితే ఇప్పటివరకూ న్యూజిలాండ్ ఐసీసీ వన్డే వరల్డ్ కప్‌ను మాత్రం న్యూజిలాండ్ దక్కించుకోలేదని చెప్పాడు. ఎదుటి జట్టు గురించి మాట్లాడే ముందు మీ సంగతి కూడా ఓసారి ఆలోచించుకోవాలని, ఇతరులకి పంచ్ ఇవ్వాలని చూస్తే, వారు తిరిగిచ్చే పంచ్‌ను కూడా స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలని శ్రీశాంత్ వివరించాడు. విరాట్ కోహ్లీ దృష్టికి ఈ వ్యాఖ్యలను వెళితే ప్రత్యర్థి జట్టులకు ఇబ్బందులు తప్పదని, ఈసారి పోటీ రసవత్తరంగా ఉంటుందన్నారు.