
SRH Playing XI: పంజాబ్ కింగ్స్‌తో 'చావో రేవో' పోరు.. కీలక మార్పులతో ఎస్ఆర్‌హెచ్ సిద్ధం!
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2025 సీజన్‌లో వరుసగా ఓటములతో బాధపడుతున్న సన్ రైజర్స్ హైదరాబాద్, ఇప్పుడు తమ ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంచుకునేందుకు కీలకమైన మ్యాచ్‌లో బరిలోకి దిగనుంది.
శనివారం (ఏప్రిల్ 12) ఉప్పల్ మైదానంలో జరిగే మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌తో ఎస్ఆర్‌హెచ్ తలపడనుంది. ఈ గేమ్‌ని నెగ్గితేనే లీగ్‌లో తమ ప్రస్థానాన్ని కొనసాగించగలదు.
తీవ్ర ఒత్తిడిలో SRH
గత నాలుగు మ్యాచ్‌ల్లో వరుస ఓటములతో పాయింట్స్ టేబుల్‌లో చివరిస్థానానికి పడిపోయిన SRH, బ్యాటింగ్ విభాగంలో తీవ్రంగా విఫలమవుతోంది.
ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలు నిలకడలేకపోవడం జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ అయ్యింది. ఈ ఇద్దరూ మెరుపులు మెరిపిస్తేనే ఎస్ఆర్‌హెచ్ మళ్లీ విజయం బాట పట్టే అవకాశం ఉంది.
Details
మంచి ఫామ్‌లో పంజాబ్ కింగ్స్
ఇక పంజాబ్ కింగ్స్ 4 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో మంచి జోష్‌లో ఉంది.
బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ విభాగంలోనూ పటిష్టంగా కనిపిస్తున్న పంజాబ్ జట్టు, ఫీల్డింగ్‌ను మెరుగుపరిస్తే వారిని ఆపటం కష్టం.
ఉప్పల్ మైదానం బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండటంతో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం
సిమర్జిత్ ఔట్, చాహర్ ఇన్
గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి వచ్చిన సిమర్జిత్ సింగ్ ఒకే ఓవర్‌లో 20 పరుగులు ఇవ్వడంతో ఓటమికి కారణమయ్యాడు.
దీంతో అతనిపై వేటు పడే అవకాశాలు ఉన్నాయి. అతని స్థానంలో రాహుల్ చాహర్‌ను ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడించే అవకాశముంది.
జంపాను ఆడిస్తే కామిందు మెండిస్‌కి విశ్రాంతి ఇవ్వనున్నారు. అప్పుడు రాహుల్ చాహర్ బెంచ్‌కే పరిమితం కావచ్చు.
Details
హర్షల్ పటేల్ రీ ఎంట్రీ..?
జ్వరం కారణంగా గత మ్యాచ్‌కు దూరమైన హర్షల్ పటేల్ పూర్తిగా కోలుకుంటే జయదేవ్ ఉనాద్కత్ స్థానంలో బరిలోకి దిగే అవకాశముంది.
పిచ్ పరిస్థితులను బట్టి జట్టులో మార్పులు చేయనున్న SRH, బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్ అయితే అదనపు బ్యాటర్‌తో, నెమ్మదిగా ఉంటే అదనపు స్పిన్నర్‌తో బరిలోకి దిగనుంది.
అయితే బ్యాటింగ్ లైనప్‌లో పెద్దగా మార్పులు చేయే అవకాశం లేదు.
Details
ఎక్స్‌ట్రా బ్యాటర్? లేక స్పిన్నర్?
ఓపెనింగ్‌కు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్‌లు ఫిక్స్. పవర్‌ప్లే వరకు నిలకడగా ఆడడం వాళ్ల బాధ్యత. తొలి మ్యాచ్‌లో సెంచరీ చేసిన ఇషాన్ కిషన్ ఆ తర్వాత మ్యాచ్‌ల్లో నిరాశపరిచాడు.
నితీష్ కుమార్ రెడ్డి కూడా తన ఫామ్‌ను కనబరచలేకపోతున్నాడు. క్లాసెన్, అనికేత్ వర్మ మెరుపులు మెరిపించినా విజయం సాధించలేకపోయారు.
అదనపు బ్యాటర్ అవసరమైతే అభినవ్ మనోహర్, అథర్వ తైడే, సచిన్ బేబీ లలో ఎవరికైనా అవకాశం దక్కవచ్చు. బౌలింగ్ విభాగంలో ప్యాట్ కమిన్స్, మహమ్మద్ షమీ, ఫిట్‌గా ఉంటే హర్షల్ పటేల్ కీలక పాత్ర పోషిస్తారు.
స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా జీషన్ అన్సారీ ఉండగా, ఆడమ్ జంపా లేదా రాహుల్ చాహర్‌లలో ఒకరిని ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడించనున్న అవకాశం ఉంది.
Details
మ్యాచ్‌పై భారీ ఆసక్తి
ఇరు జట్ల బ్యాటింగ్ లైనప్‌లు శక్తివంతంగా ఉండటంతో ఉప్పల్ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌పై భారీ ఆసక్తి నెలకొంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయం సాధిస్తే ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంటాయి.
ఓటమి అయితే ఆశలు ఆవిరైపోవచ్చు.