Page Loader
SRH vs KKR: ఉత్కంఠ పోరులో సన్ రైజర్స్ ఓటమి
పరాజయం పాలైన సన్ రైజర్స్

SRH vs KKR: ఉత్కంఠ పోరులో సన్ రైజర్స్ ఓటమి

వ్రాసిన వారు Jayachandra Akuri
May 04, 2023
11:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్‌-16లో భాగంగా ఉప్పల్ వేదికగా జరిగిన ఉత్కంఠ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ 5 పరుగుల తేడాతో కోల్ కతా నైట్ రైడర్స్ చేతిలో ఓడిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన కోల్ కతా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. కోల్ కతా బ్యాటర్లలో నితీష్ రాణా 42, రింకుసింగ్ 46, అండ్రూ రస్సెల్ 24 పరుగులతో రాణించడంతో కోల్ కత్తా గౌరవ ప్రదమైన స్కోరును చేసింది. సన్ రైజర్స్ బౌలర్లలో మార్కో జాన్సన్ 2, నటరాజన్ 2, భువనేశ్వర్ కుమార్, త్యాగి, మార్ర్కమ్, మార్కండే తలా ఓ వికెట్ సాధించారు.

Details

బ్యాటింగ్ లో తడబడిన సన్ రైజర్స్ బ్యాట్సమెన్ 

లక్ష్య చేధనకు దిగిన సన్ రైజర్స్ బ్యాట్సమెన్ మార్క్రమ్ 41, క్లాసన్ 36, రాహుల్ త్రిపాఠి 20, అబ్దుల్ సమద్ 18 పరుగులు ఫర్వాలేదనిపించారు. సన్ రైజర్స్ చివరి నాలుగు ఓవర్లలో 32 పరుగులు చేసి 3 వికెట్లు కోల్పోవడం గమనార్హం. చివరి ఓవర్లలో 8 పరుగులు అవసరం కాగా.. సన్ రైజర్స్ కేవలం 3 పరుగులే చేసింది. వరుణ్ చక్రవర్తి చివరి ఓవర్ అద్భుతంగా వేసి, ఓ వికెట్ ను తీశాడు. కోల్ కతా బౌలర్లలో వైభవ్, శార్దుల్ ఠాకూర్ రెండు వికెట్లతో రాణించగా.. అండ్రూ రస్సెల్, అంకుల్ రాయ్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రానా తలా ఓ వికెట్ తీశారు.