ఉప్పల్ స్టేడియంలో రాణించిన సన్ రైజర్స్ బౌలర్లు.. హైదరాబాద్ టార్గెట్ 171
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా 47వ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్ కతా నైట్ రైడర్స్ తలపడ్డాయి. ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో మొదట కోల్ కతా బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే రెండో ఓవర్లలో కోల్ కతా కు బిగ్ షాక్ తగిలింది. మార్కో జాన్సెన్ దెబ్బకు కోల్ కతా ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయింది. తొలి బంతికి రహ్మనుల్లా గుర్బారాజ్(0) ఔట్ కాగా, ఆఖరి బంతికి వెంకటేష్ అయ్యర్(7) కీపర్ కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. దీంతో 16 పరుగులకే రెండు వికెట్లు పడ్డాయి. అయితే నితీష్ రాణా బ్యాట్ ఝుళిపించడంతో కోల్ కతా వేగంగా పరుగులను సాధించింది.
కోల్ కతా మిడిలార్డర్ బ్యాటర్లు విఫలం
నితీష్ రాణా 42, రింకు సింగ్ 46, అండ్రూ రస్సెల్ 24 పరుగులతో ఫర్వాలేదనిపించారు. మిగతా బ్యాటర్లు సింగిల్ డిజిట్ కే వెనుతిరిగారు. దీంతో కోల్ కతా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఒకానొక దశలో కోల్ కతా భారీ స్కోరు దిశగా వెళుతుండగా.. సన్ రైజర్స్ బౌలర్లు చివర్లో కట్టుదిట్టమైన బౌలింగ్ వేసి అకట్టుకున్నారు. సన్ రైజర్స్ బౌలర్లలో మార్కో జాన్సన్ 2, నటరాజన్ 2, భువనేశ్వర్ కుమార్, త్యాగి, మార్ర్కమ్, మార్కండే తలా ఓ వికెట్ సాధించారు.