IND Vs SL: భారత బౌలర్ల ధాటికి 55 పరుగులకే శ్రీలంక ఆలౌట్
ఈ వార్తాకథనం ఏంటి
వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా ఇవాళ భారత్-శ్రీలంక తలపడ్డాయి. అయితే టీమిండియా బౌలర్లు నిప్పులు చెరిగే బంతులు సందించడంతో లంక బ్యాటర్లకు చుక్కలు కనిపించాయి.
వచ్చిన వారు వచ్చినట్లే పెవిలియానికి క్యూ కట్టారు. భారత పేస్ బౌలర్ల ధాటికి నిస్సంక, కరుణరత్న, సమరవిక్రమ, హేమంత్, చమీరా డకౌట్ అయ్యారు.
దీంతో టీమిండియా 302 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సాధించింది.
ఈ మ్యాచులో మొదట టీమిండియా బ్యాటర్ల ఊచకోతతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది.
తొలి ఓవర్ రెండో బంతికి రోహిత్ బౌల్డ్ అయ్యాడు.
ఆ తర్వాత వన్ డౌన్‌లో వచ్చిన విరాట్ కోహ్లీ(88) తనదైన శైలిలో బ్యాటింగ్ చేశారు.
Details
ఐదు వికెట్లతో చెలరేగిన మహ్మద్ షమీ
ఇక గిల్(92), శ్రేయస్ అయ్యర్(82) ఆకాశమే హద్దుగా చెలరేగిపోవడంతో టీమిండియా భారీ స్కోరును చేయగలిగింది.
లక్ష్య చేధనలో 12 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి శ్రీలంక కష్టాల్లో పడింది.
మహ్మద్ షమీ ఐదు వికెట్లు తీసి శ్రీలంక బ్యాటర్లను గడగడలాడించాడు. ఇక మహ్మద్ సిరాజ్ 3, జస్ప్రిత్ బుమ్రా, రవీంద్ర జడేజా చెరో వికెట్ పడగొట్టారు.
19.4 ఓవర్లలో 55 రన్స్ చేసి శ్రీలంక ఆలౌటైంది.
ఈ విజయంతో టీమిండియా సెమీఫైనల్ లో అడుగుపెట్టింది.