సూపర్ సిక్స్‌లో శ్రీలంక.. వరల్డ్ కప్‌లో ఆడే ఆ రెండు జట్లు ఏవో..?
ఈ వార్తాకథనం ఏంటి
జింబాబ్వే వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ క్యాలిఫయర్ లీగ్ దశలో శ్రీలంక వరుసగా హ్యాట్రిక్ విజయాలను సాధించింది. దీంతో ఆరు పాయింట్లతో సూపర్ సిక్స్ కు అర్హత సాధించింది.
ఆదివారం ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచులో శ్రీలంక 133 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దిముత్ కరణ రత్నే (103), సమర విక్రమ (82), ధనంజయ డిసిల్వా(42) పరుగులతో విజృంభించడంతో శ్రీలంక భారీ స్కోరు చేసింది.
లక్ష్య చేధనలో ఐర్లాండ్ 31 ఓవర్లలో 192 పరుగులు చేసి ఆలౌటైంది. హసరంగ (5/79) ధాటికి ఐర్లాండ్ బ్యాటర్లు పెవిలియానికి క్యూ కట్టారు.
స్కాట్లాండ్ కూడా ఓమన్ ను ఓడించడంతో ఆ జట్టు గ్రూప్-బిలో శ్రీలంక తర్వాతి స్థానంలో సూపర్ సిక్స్ కు అర్హత సాధించింది.
Details
సూపర్ సిక్స్ కు అర్హత సాధించిన జట్లు ఇవే
గ్రూప్-ఎలో వెస్టిండీస్- నెదర్లాండ్స్, జింబాబ్వే-యూఎస్ మధ్య నేడు చివరి లీగ్ మ్యాచులు జరగుతాయి. ఈ మ్యాచులో విజయం సాధిస్తేనే వెస్టిండీస్‌కు వన్డే వరల్డ్ కప్‌లో అర్హత సాధించే అవకాశాలు మెరుగవుతాయి. మరోవైపు జింబాబ్వే ఈ మ్యాచులో నెగ్గి వరల్డ్ కప్ క్వాలిఫయింగ్ బెర్తును ఖాయం చేసుకోవాలని భావిస్తోంది.
సూపర్ సిక్స్ ముగిసేసరికి టాప్-2 లో ఉన్న జట్లు అక్టోబర్ లో జరిగే వన్డే వరల్డ్ కప్ కు అర్హత సాధిస్తాయి. మరి ఆ రెండు జట్లు ఏవో తెలుసుకోవాలంటే జులై 7 దాకా వేచి చూడాల్సింది.
గ్రూపుల వారీగా సూపర్ సిక్స్ కు చేరిన జట్లు
గ్రూప్ -ఎ : జింబాబ్వే, నెదర్లాండ్స్, వెస్టిండీస్
గ్రూప్ - బి : శ్రీలంక, స్కాట్లాండ్, ఓమన్