6 వికెట్లతో చెలరేగిన హసరంగా.. ప్రపంచకప్ క్వాలిఫయర్ మ్యాచులో శ్రీలంక బోణీ
వన్డే వరల్డ్ కప్ క్వాలిఫయర్ మ్యాచులు ఉత్కంఠంగా సాగుతున్నాయి. యూఏఈతో జరిగిన మ్యాచులో శ్రీలంక 175 పరుగుల తేడాతో గెలుపొందింది. శ్రీలంక బౌలర్ హసరంగా 24 పరుగులిచ్చి 6 వికెట్లతో విజృంభించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 355 పరుగులు చేసింది. లక్ష్య చేధనకు దిగిన యూఏఈ 39 ఓవర్లలో 180 పరుగులు చేసి పరాజయం పాలైంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన శ్రీలంకకు శుభారంభం లభించింది. ఫతుమ్ నిశాంక, కరుణరత్నే తొలి వికెట్ కు 95 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. టాప్ ఆర్డర్ లో నలుగురు బ్యాటర్లు హాఫ్ సెంచరీలు సాధించడంతో శ్రీలంక భారీ స్కోరును చేసింది.
ఐర్లాండ్ పై ఒమన్ విజయం
లక్ష్య చేధనలో కెప్టెన్ మహ్మద్ వసీ(39), వికెట్ కీపర్ అరవింద్ (39), రమీజ్ షాబాద్ (26) అలి నసీర్ (34) తప్ప మిగతా బ్యాటర్లు కావడంతో యూఏఈ ఓటమి ఖరారైంది. ఈ మ్యాచులో 8 ఓవర్లు బౌలింగ్ చేసిన హసరంగ 24 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు పడగొట్టి శ్రీలంక విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక లహిరు కుమార్, మహిష థీక్షన్, దనుంజయ డిసిల్వా తలా ఓ వికెట్ తీశారు. క్వాలిఫయింగ్ రౌండ్ 4వ మ్యాచులో ఐర్లాండ్ పై ఒమన్ జట్టు ఘన విజయం సాధించింది.