
వన్డే వరల్డ్ కప్ క్యాలిఫయర్స్‌లో తొలిరోజు జింబాబ్వే, వెస్టిండీస్ విజయం
ఈ వార్తాకథనం ఏంటి
వన్డే ప్రపంచకప్‌కు సమయం దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో క్వాలిఫయర్ మ్యాచులు జరుగుతున్నాయి. తొలిరోజు రెండు మ్యాచులు జరగ్గా ఇందులో జింబాబ్వే, వెస్టిండీస్ జట్లు విజయం సాధించాయి.
ఈ ఏడాది చివర్లో భారత్‌లో జరుగనున్న వన్డే ప్రపంచకప్ కోసం క్వాలిఫయర్ మ్యాచులు మొదలయ్యాయి. అయితే జింబాబ్వే వేదికగా జరుగుతున్న ఈ క్వాలిఫయర్ రౌండ్‌లో తొలిరోజు జింబాబ్వే, నేపాల్ జట్లు తలపడ్డాయి. మరో మ్యాచులో అమెరికా, వెస్టిండీస్ జట్లు మధ్య పోరు జరిగింది.
హరారేలోని హరారే స్పోర్ట్స్ క్లబ్ లో జింబాబ్వే, నేపాల్ మధ్య జరిగిన మ్యాచులో జింబాబ్వే విజయం సాధించింది. జింబాబ్వే బ్యాటర్లు సీన్ విలియమ్స్ (102 నాటౌట్), క్రెయిన్ ఎర్విన్ (121 నాటౌట్) అజేయ శతకాలతో జింబాబ్వేను విజయతీరాలకు చేర్చారు.
Details
కుళాల్ భుర్టెల్ సెంచరీ మిస్
నేపాల్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 290 పరుగులు చేసింది. కుళాల్ భుర్టెల్ 99 పరుగుల వద్ద ఔట్ అయ్యి సెంచరీని మిస్ అయ్యాడు. లక్ష్య చేధనకు దిగిన జింబాబ్వే జట్టు మరో 38 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేధించింది.
మరో మ్యాచులో అమెరికాపై వెస్టిండీస్ జట్టు విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 49.3 ఓవర్లలో 297 పరుగులకు ఆలౌటైంది. ఛార్లెస్ 66, హోల్డర్ 56, ఛేజ్ 55 పరుగులతో ఆకట్టుకున్నారు. లక్ష్య చేధనకు దిగిన యూఎస్ఏ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 258 పరుగులు చేసి పరాజయం పాలైంది.
క్వాలిఫయర్స్ మ్యాచ్‌ల్లో భాగంగా సోమవారం శ్రీలంక-యూఏఈ, ఐర్లాండ్-ఒమన్ తలపడనున్నాయి.