భారత్ టీంను ఢీకొట్టే శ్రీలంక జట్టు ఇదే..
జనవరిలో భారత్‌లో పర్యటించే శ్రీలంక జట్టును శ్రీలంక క్రికెట్‌బోర్డు ప్రకటించింది. టీమిండియా శ్రీలంకతో మూడు టీ20 మ్యాచ్లు, మూడు వన్డే సిరీస్ లను ఆడనుంది. జనవరి 3 నుంచి మ్యాచ్ లు ప్రారంభం కానున్నాయి. శ్రీలంక జట్టు పగ్గాలను దసున్ షనకకు అప్పగించారు. అనంతరం 20 మంది సభ్యులతో కూడిన జట్టును ఆనౌన్స్ చేశారు. రెండు సిరీస్‌లకు దసున్ షనక కెప్టెన్ కాగా.. వన్డేలకు కుశాల్ మెండిస్, టీ20లకు వనిందు హసరంగ వైస్ కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు. ఇప్పటికే బీసీసీఐ కూడా భారత్ జట్లను ప్రకటించిన విషయం తెలిసిందే. టీ20లకు కెప్టెన్ గా హార్ధిక్ పాండ్యా, వన్డేలకు రోహిత్ శర్మను కెప్టెన్ గా ఎంపిక చేశారు. ఫెర్నాండో తిరిగి శ్రీలంక జట్టులో స్థానం సంపాదించుకున్నాడు.
శ్రీలంక టీం సభ్యులు వీరే..
ఇక టీమిండియా- శ్రీలంక మధ్య 3, 5, 7 తేదీల్లో టీ20, 10, 12, 15 తేదీల్లో వన్డే సిరీస్ జరుగనుంది. భారత్ లో పర్యటించే శ్రీలంక జట్టు: దాసున్ శనక(కెప్టెన్), పాథుమ్ నిస్సంక, కుశాల్ మెండిస్, చరిత్ ఆశలంక, దినేష్ చండిమాల్, దనుష్క గుణతిలక, కమిల్ మిషార, జనిత్ లియానగే, వానిందు హసరంగ, చామిక కరుణరత్నే, దుష్మంత చమీర, లాహిరు కుమార, బినుర ఫెర్నాండో, షిరాన్ ఫెర్నాండో, మహీష్ తీక్షణ, జెఫ్రీ వాండర్సే, ప్రవీణ్ జయవిక్క్రమ, ఆషియన్ డానియల్.