
Danuh Gunathilaka: అమ్మాయిపై అత్యాచారం.. నిర్దోషిగా బయటికొచ్చిన శ్రీలంక క్రికెటర్
ఈ వార్తాకథనం ఏంటి
అత్యాచార ఆరోపణల కేసులో క్రికెట్‌కు దూరమైన శ్రీలంక క్రికెటర్ దనుష్క గుణతిలకకు న్యాయస్థానంలో భారీ ఊరట లభించింది.
ఆస్ట్రేలియా అమ్మాయిపై అత్యాచారణ ఆరోపణల కేసులో దునుష్క గుణతిలక నిర్దోషిగా బయటికొచ్చాడు.
గతేడాది టీ20 వరల్డ్ కప్ సందర్భంగా ఓ మహిళపై అత్యాచారం చేసేందుకు దనుష్క గుణతిలక యత్నించినట్లు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి.
దీంతో ఆస్ట్రేలియా పోలీసులు అతడిని ఆరెస్టు చేశారు.
ఈ అత్యాచారయత్న ఆరోపణలను కొట్టేస్తూ తాజాగా ఆస్ట్రేలియా కోర్టు తీర్పునివ్వడంతో గుణతిలక నిర్దోషిగా బయటపడ్డాడు.
Details
శ్రీలంక తరుపున వందకు పైగా అంతర్జాతీయ మ్యాచులాడిన దనుష్క గుణతిలక
గుణతిలకకు కొంతకాలం క్రితం ఆన్ లైన్ లో ఓ మహిళ పరిచయమైంది. వీరిద్దరూ నవంబర్ 2న రోజే బే లోని ఓ హోటల్ గదిలో కలుసుకున్నారు.
అయితే సదరు మహిళ తనను దనుష్క గుణతిలక బలవంతం చేయబోయాడని ఆరోపణలు చేసింది.
దీనిపై వాదనలు విన్న న్యాయమూర్తి గుణతిలకకు అనుకూలంగా తీర్పునిచ్చాడు.
దీనిపై గుణతిలక హర్షం వ్యక్తం చేశారు.
అన్నింటికీ తీర్పే సమాధానం ఇచ్చిందని, ఇక నుంచి తన జీవితాన్ని ప్రశాంతంగా గడుపుతానని, మళ్లీ కచ్చితంగా జాతీయ జట్టుకు ఆడుతానని గుణతిలక పేర్కొన్నాడు.
ఇప్పటికే గుణతిలక శ్రీలంక తరుపున వందకుపైగా అంతర్జాతీయ మ్యాచులను ఆడాడు.