Page Loader
Kidambi Srikanth: జపాన్ ఆటగాడిపై గెలిచిన శ్రీకాంత్.. ఫైనల్‌కు చేరుకున్న స్టార్ షట్లర్
జపాన్ ఆటగాడిపై గెలిచిన శ్రీకాంత్.. ఫైనల్‌కు చేరుకున్న స్టార్ షట్లర్

Kidambi Srikanth: జపాన్ ఆటగాడిపై గెలిచిన శ్రీకాంత్.. ఫైనల్‌కు చేరుకున్న స్టార్ షట్లర్

వ్రాసిన వారు Jayachandra Akuri
May 24, 2025
02:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్ మలేషియా మాస్టర్స్ సూపర్ 500 టోర్నమెంట్‌లో ఫైనల్‌కు చేరుకున్నాడు. బీడబ్ల్యూఎఫ్ ఈవెంట్‌లో అతను ఆరు సంవత్సరాల విరామం తర్వాత మళ్లీ ఫైనల్‌కి ప్రవేశించడం విశేషం. శనివారం జరిగిన సెమీఫైనల్‌ మ్యాచ్‌లో శ్రీకాంత్ జపాన్‌కు చెందిన యుషిపై వరుస గేమ్‌లలో విజయం సాధించాడు. 21-18, 24-22 స్కోరుతో అతను గెలుపొందాడు. 2019 తర్వాత తొలిసారిగా శ్రీకాంత్ బీడబ్ల్యూఎఫ్ టోర్నీ ఫైనల్‌కు చేరుకున్నాడు. గతంలో ప్రపంచ నెంబర్ వన్‌ స్థానాన్ని అలంకరించిన 32 ఏళ్ల ఈ ప్లేయర్, చాన్నాళ్ల విరామం తర్వాత తన గొప్ప ఆటతీరును మళ్లీ చూపించాడు.

Details

65వ ర్యాంకులో శ్రీకాంత్

ప్రస్తుతం అతని ర్యాంక్ 65గా ఉంది. ఈ టోర్నీకి కూడా అతను క్వాలిఫయింగ్‌ రౌండ్ల ద్వారా ప్రవేశించాల్సి వచ్చింది. వరల్డ్ చాంపియన్‌షిప్‌లో సిల్వర్ మెడల్ సాధించిన శ్రీకాంత్, ప్రపంచ 23వ ర్యాంకర్‌ను ఈ సారి వరుస గేమ్‌ల్లో ఓడించడం మరో ప్రత్యేకత. 2017లో శ్రీకాంత్ బీడబ్ల్యూఎఫ్ నాలుగు టైటిళ్లు గెలుచుకుని, తన ప్రతిభతో అందర్నీ ఆకట్టుకున్నాడు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఫైనల్ కు చేరుకున్న శ్రీకాంత్