
IPL 2025: స్టార్క్ ఔట్.. హేజిల్‌వుడ్ ఇన్! దిల్లీకి ఎదురుదెబ్బ, ఆర్సీబీకి ఊరట
ఈ వార్తాకథనం ఏంటి
భారత్, పాకిస్థాన్ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ (IPL) మ్యాచ్‌లు వారం రోజుల పాటు వాయిదా పడిన సంగతి తెలిసిందే.
అయితే ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఈ నేపథ్యంలో మే 17 నుంచి ఐపీఎల్ మళ్లీ ప్రారంభం కానుంది.
ఇదే సమయంలో దిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) జట్టుకు ఓ షాకింగ్ న్యూస్ తగిలింది. ఆ జట్టుకు చెందిన ఆస్ట్రేలియన్ పేసర్ మిచెల్ స్టార్క్ తిరిగి రావడం లేదని ఫ్రాంఛైజీకి స్పష్టం చేశాడు.
ఇప్పటికే స్టార్క్ ఆడే అంశంపై అనుమానాలే వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు వాటికి ఆయన క్లారిటీ ఇచ్చాడు. తాను మిగిలిన మ్యాచ్‌లకు అందుబాటులో ఉండలేనని స్టార్క్ తెలిపాడు.
Details
జేక్ ప్రేజర్ స్థానంలో ముస్తఫిజుర్ రెహమాన్
ఈ విషయాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యానికి తెలియజేశాడు. ఫ్రాంఛైజీ కూడా స్టార్క్ నిర్ణయాన్ని గౌరవించడంతో, అతడు ఈ సీజన్‌కు దూరమైనట్టే అయింది.
ఇప్పటికే జేక్ ప్రేజర్ స్థానంలో ముస్తఫిజుర్ రెహమాన్‌ను దిల్లీ జట్టు తీసుకుంది. ఇక మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మాత్రం ఊపిరిపీల్చుకునే పరిస్థితిలోకి వచ్చింది.
ఆ జట్టుకు చెందిన జోష్ హేజిల్‌వుడ్ మే చివరి వారంలో భారత్‌కు రానున్నాడు. ప్లేఆఫ్స్ పోటీలకు ముందు అతడు జట్టుతో కలవనున్నట్లు సమాచారం.
హేజిల్‌వుడ్ రాక ఆర్సీబీ పేస్ బౌలింగ్‌కు బలాన్నిస్తుందని విశ్లేషకుల అభిప్రాయం.