Page Loader
Rishabh Pant : స్టార్క్ రికార్డు చెరిపేసిన రిషబ్ పంత్.. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధికం
స్టార్క్ రికార్డు చెరిపేసిన అయ్యర్.. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధికం

Rishabh Pant : స్టార్క్ రికార్డు చెరిపేసిన రిషబ్ పంత్.. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధికం

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 24, 2024
04:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఈసారి ఐపీఎల్ వేలంలో టీమిండియా స్టైలిష్ బ్యాటర్ రిషబ్ పంత్ సంచలన రికార్డును సృష్టించాడు. అతని కోసం ఫ్రాంచైజీల మధ్య తీవ్రమైన పోటీ నడిచింది. చివరికి లక్నో సూపర్ జెయింట్స్ ఏకంగా రూ.27 కోట్లు వెచ్చించి పంత్ ను తమ జట్టులో చేర్చుకుంది. ఇది ఐపీఎల్ వేలం చరిత్రలోనే అత్యధిక ధర కావడం విశేషం. గతంలో మిచెల్ స్టార్క్ రూ.24.75 కోట్లు ధర పలికిన విషయం తెలిసిందే. కానీ ఈ సారి పంత్ ఆ రికార్డును బ్రేక్ చేస్తూ అయ్యర్ చరిత్రను సృష్టించాడు. పంత్ కేవలం ఒక బ్యాటర్‌గానే కాదు, జట్టును ముందుండి నడిపించగల కెప్టెన్సీ ఉన్న ఆటగాడు.

Details

పంత్ కు  రికార్డు ధర

టీ20ల్లో స్ట్రైక్ రేట్, మిడిల్ ఆర్డర్‌లో క్రమంగా భారీ స్కోరు చేసే సామర్థ్యం అతనిలో ఉంది. దీంతో లక్నో సూపర్ జెయింట్స్ అతన్ని సొంతం చేసుకుంది. ఇక పంత్ వేలంలో రికార్డు స్థాయిలో ధర పలకడం ఐపీఎల్‌కు మరింత ఆసక్తి నింపింది. ఈ డీల్ లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు ఎంతవరకు విజయాన్ని అందిస్తుందో వేచి చూడాలి.