Page Loader
డెత్ ఓవర్ స్పెషలిస్ట్ హర్షద్ పటేల్‌కు ఏమైంది
బౌలింగ్ చేస్తున్న టీమిండియా ప్లేయర్ హర్షల్ పటేల్

డెత్ ఓవర్ స్పెషలిస్ట్ హర్షద్ పటేల్‌కు ఏమైంది

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 05, 2023
10:05 am

ఈ వార్తాకథనం ఏంటి

డెత్ ఓవర్లో వికెట్లు తీసి మ్యాచ్‌ను మలుపు తిప్పే హర్షల్ పటేల్ లేటుగా ఎంట్రీ ఇచ్చినా టీమిండియాకి కీ బౌలర్‌గా మారాడు. స్లో బాల్స్‌తో బ్యాటర్‌ను పరుగులు చేయకుండా ఇబ్బంది పెట్టడం హర్షల్ పటేల్ స్పెషాలిటీ. శ్రీలంకతో జరిగిన టీ20లో రెండు వికెట్లు తీసినప్పటికీ, 41 పరుగులు ఇచ్చాడు. 2021 ఐపిఎల్ సీజన్‌లో 32 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్‌ను అందుకున్నాడు. ఒక్క సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన డ్వేన్ బ్రావో రికార్డును సమం చేశాడు. ప్రస్తుతం 10+ ఎకానమీ పరుగులు ఇవ్వడం హర్షల్‌కు అలవాటుగా మారింది. గత 12 మ్యాచ్‌లో 6సార్లు 10+ ఎకానమీతో పరుగులు ఇస్తూ అశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడు హర్షల్ పటేల్.

హర్షల్ పటేల్

హర్షల్ పటేల్ తన రేంజ్ పర్ఫామెన్స్ చూపించలేకపోతున్నాడు

ఆసియా కప్‌లో టీంఇండియా హర్షద్ పటేల్‌ను పక్కన పెట్టింది. దీంతో ఎడమచేతి వాటం సీమర్ అర్ష్‌దీప్ సింగ్‌‌కు అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని అర్షదీప్ సద్వినియోగం చేసుకున్నాడు. అర్షదీప్ ICC T20 ప్రపంచకప్‌లో ప్రస్తుతం ఇండయాకి కీలక బౌలర్‌గా మారాడు. ఫలితంగా టోర్నీలో హర్షల్ పటేల్‌ బెంచ్‌కు పరిమితం కావాల్సి వచ్చింది. ఐపీఎల్ 2021 సీజన్‌లో, ఆ తర్వాతి మ్యాచుల్లో 19వ ఓవర్ వేసి టీమిండియాకి కీ బౌలర్‌గా మారిన హర్షల్ పటేల్, ఇప్పుడు తన రేంజ్ పర్ఫామెన్స్ చూపించలేకపోతున్నాడు. హర్షల్ మీడియం-పేసర్, 130కిలోమీటర్ల వేగంతో బంతులను విసరగలడు. ప్రధానంగా స్లో యార్కర్ల ద్వారా బ్యాటర్లను ఇబ్బంది పెట్టగలడు. అయితే తన బౌలింగ్లో ఎక్కువ పరుగులు ఇస్తూ.. చెత్త రికార్డులను నమోదు చేస్తున్నాడు.