Page Loader
కార్లోస్ అల్కారాజ్‌పై ప్రశంసలు కురిపించిన స్టెఫానోస్ సిట్సిపాస్
స్టెఫానోస్ సిట్సిపాస్

కార్లోస్ అల్కారాజ్‌పై ప్రశంసలు కురిపించిన స్టెఫానోస్ సిట్సిపాస్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 05, 2023
09:43 am

ఈ వార్తాకథనం ఏంటి

ఫ్రెంచ్ ఓపెన్ 2023 క్వార్టర్-ఫైనల్ షోడౌన్ కు ముందు కార్లోస్ అల్కారాజ్ పై స్టెఫానోస్ సిట్సిపాస్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచ నంబర్ 1 కార్లోస్ అల్కరాజ్ నిలకడను స్టెఫానోస్ సిట్సిపాస్ ప్రశంసించాడు. సిట్సిపాస్ ఆస్ట్రియన్ క్వాలిఫైయర్ సెబాస్టియన్ ఆఫ్నర్‌ను 7-5, 6-3, 6-0తో ఓడించి టాప్ సీడ్ అల్కారాజ్‌తో క్వార్టర్-ఫైనల్స్‌ లో తలపడనున్నాడు. అల్కరాజ్ ఆదివారం ఇటలీకి చెందిన లొరెంజో ముసెట్టీని 6-3, 6-2, 6-2తో ఓడించి ఫ్రెంచ్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్‌లోకి ప్రవేశించాడు. తాను ఎంతగానో ఎదురుచూస్తున్న క్వార్టర్ ఫైనల్ ముందుకొచ్చిందని, ప్రస్తుతం గేమ్ అన్ లో ఉందని, అల్కరాజ్ ఈ ఫైనల్లో తనకు అతిపెద్ద అడ్డంకి అని స్టెఫానోస్ సిట్సిపాస్ సరాదాగా చెప్పుకొచ్చాడు.

Details

కార్లోస్ ఎనర్జిటిక్ ప్లేయర్

కార్లోస్ అన్ని సమయాల్లో సమిష్టిగా రాణిస్తాడని, గేమ్ లో అతను చాలా హైపర్ గా ఉంటాడని, అతను ఎంతో ఎనర్జిటిక్ గా ఉంటాడో మనం కోర్టులో చూడొచ్చని సిట్సిపాస్ చెప్పుకొచ్చాడు. అతను ఏ ఆటగాడితోనైనా పోటీపడటానికి సిద్ధంగా ఉంటాడని, కార్లోస్ తో తలపడేందుకు తాను సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు. అల్కరాజ్‌తో సిట్సిపాస్ చివరి గేమ్ బార్సిలోనాలోని క్లేకోర్ట్‌లో జరిగింది. అక్కడ సిట్సిపాస్ 6-3, 6-4 తేడాతో ఘోరంగా ఓడిపోయాడు.