Steve Smith: వన్డేల్లో అరుదైన ఘనత సాధించిన స్టీవ్ స్మిత్
ఆస్ట్రేలియా బ్యాటర్ స్టీవ్ స్మిత్ వన్డేల్లో అరుదైన ఘనతను సాధించాడు. భారత్‌తో జరుగుతున్న మూడో వన్డేలో 61 బంతుల్లో (8 ఫోర్లు, 1 సిక్సర్) 74 పరుగులు చేశాడు. ఈ మ్యాచులో 20 పరుగుల వద్ద ఓ అరుదైన మైలురాయిని స్టీవన్ స్మిత్ అందుకున్నాడు. ఓవరాల్‌గా ఆస్ట్రేలియా తరఫున 5,000 వన్డే పరుగులు పూర్తి చేసిన 17వ ఆటగాడిగా స్టీవ్ స్మిత్ నిలిచాడు. స్మిత్ 145 వన్డేల్లో 129 ఇన్నింగ్స్‌లు ఆడి 5,000 పరుగులను పూర్తి చేశాడు. ఇక ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ 115 ఇన్నింగ్స్‌లో ఈ మార్కును అందుకున్నాడు. ఆరోన్ ఫించ్ (126 ఇన్నింగ్స్‌లు), పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం(97 ఇన్నింగ్స్‌లో) ఆ ఘనతను సాధించాడు.
భారత్ పై ఐదు శతకాలను బాదిన స్టీవ్ స్మిత్
లెగ్-స్పిన్నింగ్ కెరీర్‌ను ప్రారంభించిన స్మిత్, ఫిబ్రవరి 2010లో వన్డే అరంగేట్రం చేశాడు. వన్డేల్లో 44 ప్లస్ సగటుతో 12 శతకాలను, 29 హాఫ్ సెంచరీలను నమోదు చేశాడు. భారత్‌తో జరిగిన 26 వన్డేల్లో 56 సగటుతో 1,200 పైగా పరుగులు చేశాడు. భారత్‌పై ఐదు సెంచరీలు, అర్ధశతకాలను బాదాడు స్మిత్ స్వదేశంలో తొమ్మిది సెంచరీలు, 12 హాఫ్ సెంచరీలు చేశాడు.