సంచలన రికార్డుకు చేరువలో స్టీవెన్ స్మిత్
ఆస్ట్రేలియా బ్యాటర్ స్టీవెన్ స్మిత్ ఫిబ్రవరి 9 నుంచి జరగనున్న బోర్డర్-గవాస్కర్ సిరీస్‌కు సిద్ధమవుతున్నారు. స్మిత్ టీమిండియాతోనే మ్యాచ్ అంటేనే చెలరేగిపోతాడు. భారత్‌పై 14 టెస్టులు మ్యాచ్ లు ఆడి 1742 పరుగులు చేశారు. ఇందులో ఎనిమిది సెంచరీలు ఉన్నాడు. ప్రస్తుతం మరో రికార్డుకు చేరువలో స్టీవెన్ స్మిత్ నిలిచాడు. టెస్టులో అత్యంత వేగంగా 9000 పరుగులు చేసిన ఆటగాడిగా చరిత్రకెక్కనున్నారు. లెగ్ స్పిన్నర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన స్మిత్, ఆస్ట్రేలియన్ బ్యాటర్లలో ఒకరిగా ఎదిగాడు. రికీ పాంటింగ్, అలన్ బోర్డర్, స్టీవ్ వా తర్వాత టెస్ట్ క్రికెట్‌లో ఆస్ట్రేలియా తరపున అత్యధిక పరుగులు చేసిన నాల్గవ ఆటగాడిగా నిలిచాడు.
స్మిత్ సాధించిన రికార్డులివే
ఒక దశాబ్దం పాటు సాగిన కెరీర్‌లో, స్మిత్ 92 టెస్టుల్లో 8,647 పరుగులు చేశాడు. ఇందులో స్మిత్ 30 సెంచరీలు, 37 హాఫ్ సెంచరీలుచ నాలుగు డబుల్ సెంచరీలు చేశాడు. భారతదేశంలో స్మిత్ కేవలం ఆరు టెస్టుల్లో 60.00 సగటుతో 660 పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు టెస్టులో భారత్ పై 2వేల పరుగులు చేయడానికి స్మిత్ 258 పరుగుల దూరంలో ఉన్నాడు. పాంటింగ్, మైఖేల్ క్లార్క్ మాత్రమే 2వేల పరుగులు సాధించారు. భారత్‌పై ఎనిమిది టెస్టు సెంచరీలు సాధించిన స్మిత్, పాంటింగ్ రికార్డును సమం చేశారు.