NZ VS SL 2nd T20: విధ్వంసకర బ్యాటింగ్‌తో విజృంభించిన స్టీఫర్
డునెడిన్ వేదికగా శ్రీలంకతో నేడు న్యూజిలాండ్ రెండో టీ20 ఆడింది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను న్యూజిలాండ్ జట్టు 1-1తో సమం చేసింది. ఇక మూడో టీ20 ఏప్రిల్ 8న క్వీన్స్ టౌన్‌లో జరగనుంది. టాస్ గెలిచిన కివీస్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 19 ఓవర్లలో 141 పరుగులకు ఆలౌటైంది. కుశాల్ మెండిస్(10), కుశాల్ పెరీరా(35), అసలంక(24) మాత్రమే రెండెక్కల స్కోరు చేశారు. కివీస్ ఫాస్ట్ బౌలర్ ఆడమ్‌మిల్నే నాలుగు ఓవర్లో 5 వికెట్లు తీసి విజృంభించాడు. అతనితో పాటు పాటు షిప్లే, రచిన్ రవీంద్ర, జిమ్మీనీషమ్ తలా ఒక వికెట్ తీశారు.
43 బంతుల్లో 79 పరుగులు చేసిన సీఫర్ట్
లక్ష్య చేధనకు దిగిన న్యూజిలాండ్ జట్టులో టిమ్ సీఫర్ట్ 43 బంతుల్లో (3 ఫోర్లు, 6 సిక్సర్లు) 79 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. దీంతో న్యూజిలాండ్ సునాయాసంగా విజయాన్ని సాధించింది. చాడ్ బోవ్స్(31) టామ్ లాథమ్(20) పరుగులతో ఫర్వాలేదనిపించారు. దీంతో న్యూజిలాండ్ ఒక వికెట్ మాత్రమే కోల్పోయి.. మరో 32 బంతులు మిగిలుండగానే విజయాన్ని చేరుకుంది. శ్రీలంక బౌలర్‌లో కసున్ రజితకు ఒక వికెట్ దక్కింది.