
ENG vs IND: స్టోక్స్ సెన్సేషనల్ సెంచరీ.. ఇంగ్లాండ్ 669 ఆలౌట్.. భారత్‌పై 311 రన్స్ ఆధిక్యం!
ఈ వార్తాకథనం ఏంటి
ఇంగ్లండ్ వర్సెస్ భారత్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో ఇంగ్లండ్ జట్టు భారీ స్కోరుతో చెలరేగింది. తొలి ఇన్నింగ్స్‌లో కంగారు జట్టు 669 పరుగులకు ఆలౌటైంది. నాలుగో రోజు శనివారం ఆటను 544/7తో ప్రారంభించిన ఇంగ్లాండ్... మిగతా మూడు వికెట్లతో మరో 125 పరుగులు జత చేసి ఆఖరికి 311 పరుగుల ఆధిక్యం సాధించింది. ఓవర్‌నైట్ స్కోరులో 77 పరుగులతో క్రీజులో ఉన్న కెప్టెన్ బెన్ స్టోక్స్ తన అద్భుత ఆటతీరుతో శతకం పూర్తి చేసి, 141 పరుగులు (198 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్‌లు) సాధించాడు. బ్రైడన్ కార్స్ 47 పరుగులతో (54 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), లియామ్ డాసన్ 26 పరుగులతో తోడిచ్చారు.
Details
నాలుగు వికెట్లు పడగొట్టిన రవీంద్ర జడేజా
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ హైలైట్స్‌గా - జో రూట్ 150 పరుగులు (248 బంతుల్లో 14 ఫోర్లు) చేస్తూ మెరిశాడు. ఓపెనర్లు జాక్ క్రాలీ 84 (113 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్స్), బెన్ డకెట్ 94 (100 బంతుల్లో 13 ఫోర్లు) పరుగులు చేశారు. వన్‌డౌన్ ప్లేయర్ ఓలీ పోప్ 71 (128 బంతుల్లో 7 ఫోర్లు) కూడా కీలకంగా నిలిచాడు. భారత బౌలింగ్ విభాగంలో రవీంద్ర జడేజా నాలుగు వికెట్లు తీసినప్పటికీ, భారీ స్కోర్‌ను అడ్డుకోవలేకపోయాడు. బుమ్రా, వాషింగ్టన్ సుందర్ చెరో రెండు వికెట్లు, అనంతు కాంబోజ్, మహ్మద్ సిరాజ్ చెరో వికెట్ తీశారు.
Details
ఐదో ఆటగాడిగా బెన్ స్టోక్స్ రికార్డు
ఇంతలో బెన్ స్టోక్స్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఒకే టెస్టులో ఐదు వికెట్లు (5/72) పడగొట్టి, సెంచరీ (141) చేసిన ఐదో ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. టెస్టు క్రికెట్‌లో 42 ఏళ్ల తర్వాత ఈ ఫీట్ సాధించడంతో, అతని ఘనత మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. గతంలో ఈ ఘనతను డెన్నిస్ అట్కిన్సన్ (1955), గ్యారీ సోబర్స్ (1966), ముస్తాక్ మహమ్మద్ (1977), ఇమ్రాన్ ఖాన్ (1983) మాత్రమే నమోదు చేశారు.