తదుపరి వార్తా కథనం

ఆర్థిక సంక్షోభంలో భారత టెన్నిస్ స్టార్ సుమిత్ నాగల్.. ఖాతాలో కేవలం 900 యూరోలే ఉన్నాయని ఆవేదన
వ్రాసిన వారు
TEJAVYAS BESTHA
Sep 20, 2023
06:46 pm
ఈ వార్తాకథనం ఏంటి
భారత్ పురుషుల సింగిల్స్ టెన్నిస్ స్టార్ ఆటగాడు సుమిత్ నాగల్ మరోసారి ఆర్థిక సంక్షోభంతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు.
తన ఖాతాలో కేవలం 900 యూరోలు మాత్రమే ఉన్నాయని పేర్కొన్నాడు. దీంతో మంచి జీవితాన్ని గడపే అవకాశం రావట్లేదని వాపోయాడు.
ATP టూర్‌లో శిక్షణకు రూ.కోటికిపైగా ఖర్చు అవుతుంది. అయితే ప్రస్తుతం తన బ్యాంకులో రూ.లక్ష కంటే తక్కువే ఉన్నాయని ఆవేదన చెందుతున్నాడు.
కొద్దికాలంగా నాగల్, జర్మనీలోని నాన్సెల్ టెన్నిస్ అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు.నిధుల కొరతతో 2023లోని తొలి సీజన్, మొదటి మూడు నెలల్లో తనకు ఇష్టమైన శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందలేకపోయాడు.
ఈ క్రమంలో అతని స్నేహితులు సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్, క్రిస్టోఫర్ మార్క్విస్ జనవరి, ఫిబ్రవరిలో శిక్షణ నిమిత్తం సహాయం చేశారని చెప్పుకొచ్చాడు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
అకౌంట్లో రూ.లక్ష కూడా లేవని భారత టెన్నిస్ స్టార్ ఆవేదన
— Sumit Nagal (@nagalsumit) September 20, 2023
మీరు పూర్తి చేశారు