LOADING...
IPL 2026: ఉప్పల్‌లో బోల్తా కొట్టిన ఢిల్లీ.. సన్‌రైజర్స్ హ్యాట్రిక్ విక్టరీ
ఉప్పల్‌లో బోల్తా కొట్టిన ఢిల్లీ.. సన్‌రైజర్స్ హ్యాట్రిక్ విక్టరీ

IPL 2026: ఉప్పల్‌లో బోల్తా కొట్టిన ఢిల్లీ.. సన్‌రైజర్స్ హ్యాట్రిక్ విక్టరీ

వ్రాసిన వారు Moogati Shabari
Apr 21, 2026
11:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారీ టార్గెట్ ముందు ఢిల్లీ క్యాపిటల్స్ బోల్తా పడింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుసగా మూడో విజయం సాధించి హ్యాట్రిక్ విక్టరీతో జోరు కొనసాగిస్తోంది. ఐపీఎల్ 2026లో సన్‌ రైజర్స్ హైదరాబాద్ ఫామ్‌లోకి వచ్చేసింది. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో గెలిచి పాయింట్ల పట్టికలో దూసుకెళ్తోంది. ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. భారీ స్కోర్ ఛేజింగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ పోరాడినప్పటికీ చివరికి ఓటమి తప్పలేదు. 47 పరుగుల తేడాతో గెలిచిన సన్‌రైజర్స్ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది.

వివరాలు

షేక్ చేసిన అభిషేక్ 

ఉప్పల్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ ఎంచుకుంది. అయితే ఆరెంజ్ ఆర్మీ ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి తన దూకుడు బ్యాటింగ్‌తో చెలరేగిపోయాడు. 47 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి, అజేయంగా 135 పరుగులు చేశాడు. చివర్లో క్లాసెన్ కూడా దుమ్మురేపడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 242 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు షాక్ తగిలింది. ఓపెనర్ నిస్సాంక త్వరగానే ఔటయ్యాడు. 21 పరుగులకే తొలి వికెట్ కోల్పోయిన ఢిల్లీకి, ఆ తర్వాత వచ్చిన నితీష్ రాణా కాస్త ఆశలు కల్పించాడు. మ్యాచ్‌ను ఢిల్లీ వైపు తిప్పేలా కనిపించినా, ఇషాన్ మలింగ బ్రేక్ వేశాడు.

వివరాలు

బౌండరీలు బాదిన బ్యాటర్లు..

107 పరుగుల వద్ద కేఎల్ రాహుల్‌ను షాకీబ్ హుస్సేన్ ఔట్ చేయగా, వెంటనే అదే ఓవర్‌లో నితీష్ రాణా, డేవిడ్ మిల్లర్‌ను ఇషాన్ మలింగ వరుసగా పెవిలియన్‌కు పంపించాడు. దీంతో ఢిల్లీ 107 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. అయినా ఒకవైపు వికెట్లు పడుతున్నా మరోవైపు బ్యాటర్లు బౌండరీలు బాదుతూనే ఉన్నారు. ట్రిస్టన్ స్టబ్స్, సమీర్ రిజ్వీ కలిసి ఐదో వికెట్‌కు 59 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. కానీ ఈ జోడీని కూడా ఇషాన్ మలింగనే విడదీశాడు.

Advertisement

వివరాలు

కుదేలైన ఢిల్లీ ఇన్నింగ్స్..

స్టబ్స్ 27 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఆ తర్వాత కూడా ఢిల్లీ ఇన్నింగ్స్ కుదేలైంది. అశుతోష్ 14, అక్షర్ 2 పరుగులు చేసి ఔట్ కాగా, సమీర్ రిజ్వీ 41 పరుగులు చేశాడు. చివరికి ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 195 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ 47 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఇషాన్ మలింగ 4 ఓవర్లలో 32 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసి అదరగొట్టగా, హర్ష్ దూబే 2 ఓవర్లలో 3 వికెట్లు పడగొట్టి కీలక పాత్ర పోషించాడు.

Advertisement