ఈసారీ ఐపీఎల్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ తగ్గేదేలే..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ ఎడిషన్ కోసం సన్ రైజర్స్ హైదరాబాద్ సిద్ధమైంది. ఈసారీ ఐపీఎల్ లో అందరికి లెక్కలను తేల్చనుంది. గత రెండు సీజన్లలోనూ పేలవ ప్రదర్శన నిరాశపరిచింది. సన్ రైజర్స్ భారీ మార్పులతో బరిలోకి దిగనుంది. గతేడాది జరిగిన మెగా వేలంలో ఒక పద్ధతి ప్రకారం ప్లేయర్లను తీసుకుంది. హ్యారీ బ్రూక్, హెన్రిచ్ క్లాసెన్, మయాంక్ అగర్వాల్, ఆదిల్ రషీద్ లాంటి ప్లేయర్లను కొనుగోలు చేసి పటిష్టంగా కనిపిస్తోంది. తాజాగా సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్లు అంతా అద్భుత ఫామ్ లో ఉన్నారు. రంజీ ట్రోఫీలో మయాంక్ అగర్వాల్ డబుల్ సెంచరీతో విజృంభించాడు. సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో మార్క్రమ్ 58 బంతుల్లో సెంచరీ చేసి చెలరేగిన విషయం తెలిసిందే.
బౌలింగ్‌లో బలంగా సన్ రైజర్స్ జట్టు
హెన్రిచ్ క్లాసెన్ సౌతాఫ్రికా 20 లీగ్ లో 10 మ్యాచ్ లు ఆడి 300 పైగా పరుగులు చేశాడు. ఇక వాషింగ్టన్ సుందర్, అభిషేక్ శర్మ సూపర్ టచ్‌లో ఉన్నారు. బౌలింగ్ విభాగంలో భువనేశ్వర్ కుమార్, మార్కో జాన్సెన్, నటరాజన్ ప్రత్యర్థులను దడపుట్టించడానికి సిద్ధంగా ఉన్నారు. ఓపెనర్లుగా మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ బరిలోకి దిగే ఛాన్సుంది. మిడిలార్డర్‌లో త్రిపాఠీ, కెప్టెన్ మార్క్రమ్, హ్యారిబ్రూక్ సత్తా చాటే అవకాశం ఉంది. 157 కి.మి వేగంతో బంతుల విసిరే ఉమ్రాన్ మాలిక్ గతేడాది ఐపీఎల్ 2022 లో ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డును సొంతం చేసుకున్నాడు. అదిల్ రషీద్ కి కూడా బౌలింగ్‌లో మంచి అనుభవం ఉంది