ఐపీఎల్‌లో చెలరేగేందుకు సన్ రైజర్స్ ఆల్ రౌండర్లు రెడీ..!
ఈ వార్తాకథనం ఏంటి
క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ రేపటి నుంచి ప్రారంభం కాబోతోంది. ఈ లీగ్ లో ఫ్యాన్స్‌లో అలరించడానికి సన్ రైజర్స్ హైదరాబాద్ సిద్ధమైంది. కొన్నేళ్లుగా నిరాశపరుస్తున్న సన్ రైజర్స్ ఈ సారీ భారీ మార్పులతో బరిలోకి దిగనుంది.
సన్ రైజర్స్ ఆటగాళ్లు ఈ సీజన్ లో చెలరేగడానికి సిద్ధమయ్యారు. వాషింగ్టన్ సుందర్, అభిషేక్ శర్మ, మార్కో జాన్సెన్ బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ విజృంభించనున్నారు.
ముఖ్యంగా టీమిండియా బౌలర్ వాషింగ్టన్ సుందర్ చాలా సందర్భాలలో తానేంటో నిరూపించుకున్నాడు. బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇప్పటివరకూ 51 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన సుందర్ 318 రన్స్ తో పాటు 33 వికెట్లను పడగొట్టాడు.
సన్ రైజర్స్
ఆల్ రౌండర్లు రాణిస్తే సన్ రైజర్స్ జట్టుకు తిరుగుండదు
అభిషేక్ శర్మ బ్యాటింగ్‌లో సన్ రైజర్స్ కు వెన్నుముఖలా నిలుస్తున్నాడు. మిడిలార్డర్ విభాగంలో స్కోరును పెంచడానికి కృషి చేస్తున్నాడు. ఐపీఎల్ లో 36 మ్యాచ్ లు ఆడి 667 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలున్నాయి.
సౌతాఫ్రికా పేసర్ మార్కో జాన్సెన్ కీలక సమయంలో వికెట్లు తీసే అవకాశం ఉంది. ఐపీఎల్ లో పది మ్యాచ్ లు ఆడిన మార్కో జాన్సెన్ 9 వికెట్లను తీశాడు. ఈ యువ పేసర్ యార్కర్లతో ప్రత్యర్థులను బోల్తా కొట్టించగలడు. మరోవైపు చివర్లో బ్యాట్‌ను ఝుళిపించడానికి తాను సిద్ధం అంటూ జాన్సెన్ హెచ్చరికలు జారీ చేస్తున్నాడు.
ఈ ముగ్గురు ఐపీఎల్‌లో రాణిస్తే సన్ రైజర్స్ జట్టుకు తిరుగుండదని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.