IPL 2023 : చైన్నై సూపర్ కింగ్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ బిగ్ ఫైట్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ భాగంగా 29వ మ్యాచ్‌లో చైన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ లో చైన్నైలోని చిదంబరం స్టేడియంలో జరగనుంది. సీఎస్కే ఐదు మ్యాచ్ ల్లో మూడు మ్యాచ్ లు నెగ్గగా.. సన్ రైజర్స్ ఐదు మ్యాచ్ ల్లో రెండు విజయాలను నమోదు చేసింది. సన్ రైజర్స్ కంటే సీఎస్కే చాలా మెరుగ్గా ఉంది. బలమైన సీఎస్కే జట్టును ఎదర్కోవడానికి సన్ రైజర్స్ ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది.చిదంబరం స్టేడియం బౌలర్లకు అనుకూలంగా ఉండనుంది. మొదట టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకొనే అవకాశం ఉంటుంది. చైన్నై ఆటగాడు కాన్వే అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. ఐదు మ్యాచ్ ల్లో 181 పరుగులతో సత్తా చాటాడు.
ఇరు జట్లులోని సభ్యులు
ఇక ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా తన బౌలింగ్ తో ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టే సత్తా ఉంది. ఈ సీజన్ లో ఆరు వికెట్లు సొంతం చేసుకున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ : డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, రహానే, మొయిన్ అలీ, శివమ్ దూబే, జడేజా, MS ధోని (c & wk), డ్వైన్ ప్రిటోరియస్, మతీషా పతిరనా, దేశ్‌పాండే, ఆకాష్ సింగ్ సన్‌రైజర్స్ : మయాంక్ అగర్వాల్, హ్యారీ బ్రూక్, రాహుల్ త్రిపాఠి, మార్క్రామ్ (c), హెన్రిచ్ క్లాసెన్ (WK), అభిషేక్ శర్మ, వాషింగ్టన్ సుందర్, మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, నటరాజన్