IPL 2023: సన్ రైజర్స్, చైన్నైలోని కీలక ఆటగాళ్లు వీరే!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 29 మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్, చైన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనుంది. నాలుగు సార్లు ఐపీఎల్ ట్రోఫీ సాధించిన చైన్నై ఈ సీజన్‌లో మూడు విజయాలను సాధించింది. మరోపక్క సన్ రైజర్స్ ఐదు మ్యాచ్‌లు ఆడి రెండింట్లో విజయం సాధించింది. ఐపీఎల్ పవర్ ప్లేలో అత్యధికంగా 60 వికెట్లు తీసిన ఆటగాడిగా భువనేశ్వర్ కుమార్ కు రికార్డు ఉంది. రుతురాజ్ గైక్వాడ్ ని ఐపీఎల్ లో మూడుసార్లు భువనేశ్వర్ ఔట్ చేశాడు. భువనేశ్వర్ బౌలింగ్ గైక్వాడ్ 22 బంతులు ఆడి 21 పరుగులు మాత్రమే చేశాడు. ఈ సీజన్‌లో పవర్‌ప్లే గైక్వాడ్ స్ట్రైక్ రేట్ 150.37గా ఉంది.
హ్యారీబ్రూక్ మళ్లీ చెలరేగేనా..?
లెగ్ స్పిన్నర్ మయాంక్ మార్కండే ఈ సీజన్‌లో కేవలం మూడు మ్యాచ్‌లలో ఆరు వికెట్లు పడగొట్టి మంచి ఫామ్ లో ఉన్నాడు. ఐపీఎల్ లో హ్యారీ బ్రూక్ మొదటి సెంచరీ భీకర ఫామ్ లో ఉన్నాడు. తుషార్ పాండే బౌలింగ్ లో హ్యారీ బ్రూక్ ఏ విధంగా రాణిస్తాడో వేచి చూడాలి ఎస్ఆర్‌హెచ్ కెప్టెన్ ఐడెన్ మర్క్రమ్ అద్భుత ఫామ్ లో ఉన్నాడు. మార్క్రామ్ టీ20ల్లో స్పిన్నర్‌లకు వ్యతిరేకంగా 133.94 స్ట్రైక్ రేట్‌ను కలిగి ఉన్నాడు. ఇరు జట్లు విజయం సాధించి, పాయింట్ల పట్టికలో మెరుగైన స్థానానికి చేరుకోవాలని భావిస్తున్నాయి