IPL 2023: సూపర్ ఫామ్‌లో అంజిక్యా రహానే
ఈ వార్తాకథనం ఏంటి
గత కొంతకాలంగా ఫామ్ లేక ఇబ్బంది పడుతున్న టీమిండియా క్రికెటర్ అంజిక్యా రహానే ఐపీఎల్ దుమ్ములేపుతున్నాడు. అటు బ్యాట్‌తోనూ మైదానంలో కళ్లు చెదిరే ఫీల్డింగ్‌తో అద్భుత ప్రదర్శన చేస్తున్నారు.
టీ20ల్లో వేగంగా ఆడలేడని ముద్ర వేసుకున్న రహానే ఈ ఐపీఎల్ లో తన శైలికి భిన్నింగా విజృంభిస్తున్నాడు. ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో కేవలం 27 బంతుల్లో 61 పరుగులతో సంచలన ఇన్నింగ్స్ ఆడాడు.
తాజాగా మరోసారి బెంగళూర్ జట్టుపై విరుచుకుపడ్డాడు. 20 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 37 పరుగులు చేశాడు.
ఐపీఎల్ 2019 సీజన్ వరకు రహానే టాప్ బ్యాటర్‌గా నిలిచాడు. ఒకప్పుడు రాజస్థాన్ రాయల్స్‌కు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు.
detais
ఐపీఎల్ లో రెండు సెంచరీలు చేసిన రహానే
ఐపీఎల్ 2019 సీజన్ వరకు రహానే టాప్ బ్యాటర్‌గా నిలిచాడు. ఒకప్పుడు రాజస్థాన్ రాయల్స్‌కు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు.
2021,22 సీజన్లో ఢిల్లీ తరుపున 11 మ్యాచ్ లను రహానే ఆడాడు. 2023 వేలంలో CSK తప్ప మరే ఇతర ఫ్రాంచైజీ రహానేని కోనడానికి ముందుకు రాలేదు.
బెన్ స్టోక్స్ గాయపడటంతో అతని స్థానంలో రహానే చైన్నై తరుపున బరిలోకి దిగాడు. రహానే 2008లో ముంబై తరుపున ఐపీఎల్ లో అరంగేట్రం చేశాడు. తర్వాత రాజస్థాన్ రాయల్స్, రైజింగ్ పూణే సూపర్‌జైంట్, ఢిల్లీ క్యాపిటల్స్, కోల్ కతా నైట్ రైడర్స్ తరుపున ఆడాడు.
రహానే ఐపీఎల్లో 31.13 సగటుతో 4,203 పరుగులు చేశాడు. ఇందులో 29 హాఫ్ సెంచరీలు, రెండు సెంచరీలున్నాయి.