IPL 2023: సీఎస్కే, ఆర్సీబీ మ్యాచ్‌లో సూపర్ రికార్డు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా సీఎస్కే, ఆర్సీబీ మ్యాచ్లో పలు రికార్డులు బద్దలయ్యాయి. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఇరు జట్ల బ్యాట్స్ మెన్స్ బౌండరీల వర్షం కురిపించారు. బ్యాటింగ్ దిగిన చైన్నై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. డెవాన్ కాన్వే 83 పరుగులు, శివం దూబే 52 పరుగులతో చెలరేగారు. దీంతో చైన్నై భారీ స్కోరు చేసింది. అయితే తాము ఏమి తక్కువ అన్నట్లుగా ఆర్సీబీ కూడా చైన్నై బౌలర్లపై విరుచుకుపడింది. బెంగళూర్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 218 పరుగులు చేసి ఓడిపోయింది. మాక్స్ వెల్ 76 పరుగులు, డుప్లెసిస్ 62 విజృంభించినా.. సీఎస్కేనే విజయం సాధించింది.
అత్యధిక సిక్సర్లు నమోదు
ఈ మ్యాచ్ లో ఓవరాల్ గా 33 సిక్సర్లు నమోదయ్యాయి. గతంలో ఉన్న ఈ రికార్డును ఆర్సీబీ, చైన్నై సమం చేసింది. 2018లో బెంగుళూరులో ఆర్సీబీ, చైన్నై మధ్య జరిగిన మ్యాచ్ లోనూ 33 సిక్సర్లు నమోదయ్యాయి. షార్జాలో రాజస్థాన్, సీఎస్కే మధ్య జరిగిన మ్యాచ్ లోనూ 33 సిక్సర్లు నమోదు కావడం విశేషం. ఏప్రిల్ 20న ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ తో తలపడనుంది.
ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి