IPL 2023: వాషింగ్టన్ సుందర్ vs రోహిత్ శర్మ.. ఎవరిది పైచేయి?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 25వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో మంగళవారం జరగనుంది. ఈ మ్యాచ్‌లో వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో రోహిత్ పరుగులు రాణిస్తాడో లేదో వేచి చూడాలి. వీరిద్దరూ ఆరు ఐపీఎల్ మ్యాచ్‌లో తలపడినప్పుడు సుందర్ మూడుసార్లు రోహిత్ శర్మను ఔట్ చేశాడు. ఐపీఎల్‌లో రోహిత్ శర్మను ఎక్కువ సార్లు ఔట్ చేసిన ఆటగాడిగా సునీల్ నరైన్ (7 సార్లు)కు పేరుంది. ముఖ్యంగా పవర్ ప్లేలో రోహిత్ ను సుందర్ రెండుసార్లు ఔట్ చేశాడు. ఇప్పటివరకూ సుందర్ పవర్‌ప్లేలో 34 ఇన్నింగ్స్‌లు ఆడి 12 వికెట్లు పడగొట్టాడు.
ఐపీఎల్ లో 5,986 పరుగులు చేసిన రోహిత్ శర్మ
ఈ సీజన్లో సుందర్ పవర్ ప్లేలో రెండు ఓవర్లు వేసి 30 పరుగులను సమర్పించుకున్నాడు. ఐపీఎల్‌లో ఆఫ్ స్పిన్నర్ల బౌలింగ్ రోహిత్ శర్మ పరుగులు రాబట్టడంతో విఫలమవుతున్నాడు. 92 ఇన్నింగ్స్‌లలో 19 సార్లు ఆఫ్ స్పిన్నర్ల బౌలింగ్‌లో రోహిత్ ఔట్ అయ్యాడు. రోహిత్ 231 ఐపీఎల్ మ్యాచ్ లు ఆడి 129.93 స్ట్రైక్ రేట్‌తో 5,986 పరుగులు చేశాడు. హైదరాబాద్ స్టేడియంలో 38.83 సగటుతో 466 పరుగులను సాధించాడు. ఈ సీజన్‌లో రోహిత్‌కు స్థిరమైన ఆరంభాలు లభించలేదు. ఈ ఐపీఎల్ లో నాలుగు మ్యాచ్ లు ఆడి ఓ అర్ధ సెంచరీని మాత్రమే సాధించాడు. ఐపీఎల్ వరుసగా 1, 21, 65, 20 పరుగులను చేశాడు.