
CSK Vs SRH: చెన్నై ఓటమి.. సన్‌రైజర్స్‌కు మూడో విజయం
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 18వ సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
155 పరుగుల లక్ష్యంతో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన సన్‌రైజర్స్ జట్టు 18.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి గెలుపు లక్ష్యాన్ని చేరుకుంది.
ఇషాన్ కిషన్ 44 పరుగులు చేయగా, ట్రావిస్ హెడ్ 19 పరుగులు, అనికేత్ వర్మ 19 పరుగులతో జట్టుకు సహకారం అందించారు.
అభిషేక్ శర్మ మాత్రం ఖలీల్ అహ్మద్ వేసిన ఓవర్‌లో (0.2 ఓవర్) క్యాచ్ ఇచ్చి డకౌట్‌గా పెవిలియన్‌కు చేరారు.
చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ విభాగంలో నూర్ అహ్మద్ రెండు వికెట్లు పడగొట్టగా,ఖలీల్ అహ్మద్, కాంబోజ్, రవీంద్ర జడేజా ఒక్కొక్క వికెట్ తీసుకున్నారు.
వివరాలు
అద్భుతంగా ఆడిన డెవాల్డ్ బ్రెవిస్
అంతకుముందు, టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు బౌలింగ్ ఎంచుకుంది.
చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు నిర్ణీత 20 ఓవర్లను పూర్తి చేయకముందే, 19.5 ఓవర్లలో 154 పరుగులకే ఆలౌట్ అయ్యింది.
ముఖ్యంగా చివరి ఐదు ఓవర్లలో చెన్నై జట్టు కేవలం 30 పరుగులు మాత్రమే సాధించగా,ఈ సమయంలో 4 కీలక వికెట్లు కోల్పోయింది.
ఈ కారణంగా జట్టు తక్కువ స్కోరు చేసింది. ఇక SRH బౌలర్లు అసాధారణంగా బౌలింగ్ చేస్తూ ప్రత్యర్థిని చక్కగా కట్టడి చేశారు.
చెన్నై ఇన్నింగ్స్‌లో డెవాల్డ్ బ్రెవిస్ 25 బంతుల్లో నాలుగు భారీ సిక్సర్లు బాదుతూ 42 పరుగులతో మంచి ఇన్నింగ్స్ ఆడాడు.
వివరాలు
మెరుపులు మెరిపించి హర్షల్ పటేల్
అతనితో పాటు ఆయుష్ మాత్రే 19 బంతుల్లో 30 పరుగులు చేసి మంచి సహకారం అందించాడు.
ఇక ఎంఎస్ ధోనీ తన 400వ టీ20 మ్యాచ్‌లో భాగంగా బరిలోకి దిగాడు. అయితే, హర్షల్ పటేల్ వేసిన బంతికి కేవలం 6 పరుగులకే ఔటవడంతో, అభిమానుల్లో నిరాశ నెలకొంది.
బౌలింగ్ విభాగంలో హర్షల్ పటేల్ మెరుపులు మెరిపించాడు. తన నాలుగు ఓవర్లలో 28 పరుగులు ఇచ్చి నలుగురు బ్యాటర్లను పెవిలియన్‌కి పంపించాడు.
మరోవైపు జైదేవ్ ఉనద్కట్ 2.5 ఓవర్లు వేసి 21 పరుగులకే 2 వికెట్లు తీసాడు. కమిందు మెండిస్, జీషాన్ అన్సారీలు తమ బౌలింగ్‌తో సీఎస్‌కే బ్యాటర్లపై ఒత్తిడి కొనసాగించారు.