Page Loader
సన్ రైజర్స్ యూట్యూబ్ ఛానెల్ హ్యాక్.. ఆరు గంటల్లో 29 వీడియోలు అప్‌లోడ్..?
ఏప్రిల్ 2న రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనున్న సన్ రైజర్స్

సన్ రైజర్స్ యూట్యూబ్ ఛానెల్ హ్యాక్.. ఆరు గంటల్లో 29 వీడియోలు అప్‌లోడ్..?

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 18, 2023
11:53 am

ఈ వార్తాకథనం ఏంటి

సన్ రైజర్స్ హైదారాబాద్ టీంకి సైబర్ నేరగాళ్లు గట్టి షాక్‌నిచ్చారు. ఏకంగా సన్ రైజర్స్ యూట్యూబ్ ఛానల్ కి హ్యాక్ చేసి ఝలక్ ఇచ్చారు. ఆరు గంటల్లో ఏకంగా 29 వీడియోలను అప్‌లోడ్ చేయడంలో అభిమానులు షాక్ కు గురయ్యాడు. ఈ ఘటన శనివారం తెల్లవారుజామున జరిగింది. ఐపీఎల్ జట్టుకు సంబంధం లేని వీడియోలు అప్ లోడ్ కావడంతో సన్ రైజర్స్ యాజమాన్యం షాక్ కు గురైంది. సన్ రైజర్స్ శుక్రవారం ఐపీఎల్ కొత్త జెర్సీని విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ వీడియో తర్వాత గేమ్స్, సాఫ్ట్ వేర్ లింక్ లతో కూడిన వీడియోలను సన్ రైజర్స్ హైదరాబాద్ ఛానల్లో ప్రత్యక్షమయ్యాయి.

సన్ రైజర్స్

స్పందించని సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం

కొంతమంది సైబర్ నేరగాళ్లు హైదరాబాద్ యూట్యూబ్ ఛానెల్‌లోకి ప్రవేశించి, వారి సెక్యూరిటీని ఉల్లంఘించినట్లు స్పష్టంగా కనిపిస్తోంది, తద్వారా ఆ ఛానెల్‌ని హ్యాక్ చేసి, వీడియోలన్నింటినీ పోస్ట్ చేశారు. ఈ ఘటనపై అధికారికంగా సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ఇంకా స్పందించకపోవడం గమనార్హం. మార్చి 31న ఐపీఎల్ ప్రారంభం కానుంది. ఏప్రిల్ 2న రాజస్థాన్ రాయల్స్‌తో సన్ రైజర్స్ హైదరాబాద్ పోటీ పడనుంది. ఏడాది సన్ రైజర్స్ జట్టుకు ఏడెన్ మార్క్‌రమ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.