Page Loader
Cricket In Olympics: క్రికెట్ ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చే న్యూస్.. ఒలింపిక్స్‌లోనూ క్రికెట్‌కు చోటు
క్రికెట్ ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చే న్యూస్.. ఒలింపిక్స్‌లోనూ క్రికెట్‌కు చోటు

Cricket In Olympics: క్రికెట్ ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చే న్యూస్.. ఒలింపిక్స్‌లోనూ క్రికెట్‌కు చోటు

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 13, 2023
05:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రస్తుతం క్రికెట్‌కు ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పెరుగుతోంది. ఎన్నో ఎళ్లుగా క్రికెట్‌ను ఒలింపిక్స్‌లో భాగం చేయాలని ఐసీసీ కృషి చేస్తోంది. తాజాగా క్రికెట్‌ను ఒలింపిక్స్‌లో చూసే అవకాశం దక్కింది. వచ్చే ఏడాది పారిస్ ఒలింపిక్స్ లో కాకుండా, లాస్ ఏంజెలెస్ వేదికగా జరగనున్న 2028 ఒలింపిక్స్ (Olympics) క్రికెట్‌కు చోటు కల్పిస్తూ అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఇటీవల ఆసియా క్రీడల్లో క్రికెట్ విజయవంతం కావడం, చాలా ఏళ్లుగా ఒలింపిక్స్ లో ఈ క్రీడను చేర్చాలనే ప్రతిపాదన ఉండటంతో ఐవోసి కమిటీ (IOC) తాజాగా దీనికి ఆమోద ముద్ర వేసింది.

Details

క్రికెట్‌తో పాటు బేస్‌బాల్‌, ఫ్లాగ్‌ ఫుట్‌బాల్‌, లాక్రోసీ, స్క్వాష్‌ క్రీడలకు ఆమోదం

ఈ నిర్ణయాన్ని ఒలింపిక్ ప్రోగ్రామ్ కమిషన్(OPC) సమీక్షించి ఓటింగ్ ద్వారా అధికారికంగా క్రికెట్ ఒలింపిక్స్‌లో చేరిపోనుంది. ఇప్పటికే వరల్డ్ కప్, ఆసియా కప్, ఛాంపియన్ ట్రోఫీ వంటి బహుళ దేశాల టోర్నీలను చూసే అభిమానులకు ఒలింపిక్స్ రూపంలో మరో టోర్నీ చూసే అవకాశం కలగనుంది. ఇక 2028 ఒలింపిక్స్‌లో క్రికెట్‌తో పాటు బేస్‌బాల్‌, ఫ్లాగ్‌ ఫుట్‌బాల్‌, లాక్రోసీ, స్క్వాష్‌ క్రీడలకు కూడా చోటుకు అమోదం తెలిపినట్లు ఐవోసీ ట్వీట్‌ చేసింది. ఒలింపిక్స్ లో క్రికెట్‌ను చేర్చి భారత్‌లో ప్రసార హక్కుల నుంచి భారీగా సోమ్ము రాబట్టాలని అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ భావిస్తోంది.