క్రికెట్ లవర్స్‌కు సూపర్‌న్యూస్.. ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్ ఫ్రీగా చూసే అవకాశం
ఐపీఎల్ టోర్నమెంట్ డిజిటల్ స్ట్రీమింగ్ ను ప్రసారం చేసిన జియో సినిమా వ్యూస్ లో సరికొత్త రికార్డును నెలకొల్పిన విషయం తెలిసిందే. 3 కోట్ల మందికి పైగా ఫైనల్ మ్యాచును జియో సినిమాలో వీక్షించారు. అంతకుముందు ఐపీఎల్ మ్యాచుల డిజిటల్ ప్రసార హక్కులను పొందిన డిస్నీ హాట్ స్టార్ పై ఒత్తిడి పెరిగింది. చాలా మంది చందాదారులు డీస్నీ ప్లస్ హాట్ స్టార్ నుంచి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో క్రికెట్ అభిమానుల కోసం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ శుభవార్తను అందించింది. త్వరలో జరిగే ఆసియా కప్, ఐసీసీ మెన్స్ ప్రపంచ కప్ మ్యాచులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఉచితంగా చూడొచ్చని ప్రకటించింది.
స్మార్ట్ ఫోన్లలో మాత్రమే ఉచితంగా చూసే అవకాశం
ప్రత్యేకంగా మొబైల్ వినియోగదారులను దృష్టిలో ఉంచుకొని ఈ ఆఫర్ ను తీసుకొచ్చినట్లు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ తెలిపింది. దీంతో ఇండియాలో 540 మిలియన్లకు పైగా ఉన్న స్టార్ట్ ఫోన్ యూజర్లకు రాబోయే టోర్నమెంట్స్ ను ఫీగా చూడొచ్చని డిస్నీ స్పష్టం చేసింది. టీవీల్లో మ్యాచ్‌లను చూసే వారికి ఈ ఉచిత ఆఫర్ వర్తించదని చెప్పారు. అదే విధంగా ట్యాబ్లెట్స్ లో మ్యాచులు చూసే వారికి ఈ ఆఫర్ వర్తించనుంది. ఆసియా కప్ లో భాగంగా మొత్తం 13 మ్యాచులు జరగనున్నాయి. అదే విధంగా వరల్డ్ కప్‌లో మొత్తం 48 మ్యాచులు ఉంటాయి.