NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / రెజర్ల ఆందోళనపై ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు నోటీసులు
    రెజర్ల ఆందోళనపై ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు నోటీసులు
    1/2
    క్రీడలు 0 నిమి చదవండి

    రెజర్ల ఆందోళనపై ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు నోటీసులు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Apr 25, 2023
    01:34 pm
    రెజర్ల ఆందోళనపై ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు నోటీసులు
    ఆందోళన చేస్తున్న రెజర్లు

    లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్ పై చర్యలు తీసుకొని, కేసు నమోదు చేయాలని భారత టాప్ రెజర్లు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆదివారం నుంచి ఆందోళన చేస్తున్నారు. దీనిపై రెజర్లు కోర్టులో పిటినెస్‌ను దాఖలు చేశారు. ఈ తరుణంలో సుప్రీంకోర్టు వారి పిటిషన్‌పై స్పందించి ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. బ్రిబ్ భూషణ్ పై ఎఫ్ఐఆర్ విషయంలో స్పందన తెలపాలని ఢిల్లీ పోలీసులకు, ఢిల్లీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహాతో కూడిన ధర్మాసనం నోటీసులిచ్చింది. రెజర్లు చేసిన ఆరోపణలు తీవ్రమైనవి కావడంతో, శుక్రవారం మళ్లీ ఈ విషయంపై కోర్టు విచారణ జరపనుంది.

    2/2

    కంటతడి పెట్టిన సాక్షి మాలిక్, వినేష్ పోగాట్

    బ్రిజ్ భూషణ్ పై లైగింక ఆరోపణలు ఉన్నా ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ కోర్టుకు తెలియజేశారు. దీంతో కోర్టు నోటీసులు జారీ చేస్తున్నామని, విచారణ కోసం శుక్రవారానికి లిస్ట్ తయారు చేయాలని ఆదేశించింది. అయితే బ్రిజ్ భూషణ్ పై పోలీసులు కేసు నమోదు చేయలేదంటూ ఏడుగురు మహిళా రెజ్లర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ ఏడాది జనవరిలోనూ రెజర్లు ఢిల్లీలో ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. బ్రిజ్ భూషణ్ పై చర్యు తీసుకొనే వారు తాము ఆందోళన విరమించమని సాక్షి మాలిక్, వినేష్ పోగాట్ భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    రెజ్లింగ్
    సుప్రీంకోర్టు

    రెజ్లింగ్

    డబ్ల్యూఎఫ్‌ఐ వివాదం: విచారణ పూర్తయ్యే వరకు బ్రిజ్ భూషణ్ పదవిలో ఉండరు: అనురాగ్ ఠాకూర్ అనురాగ్ సింగ్ ఠాకూర్
    అనురాగ్ ఠాకూర్‌తో భారత రెజ్లర్ల సమావేశం, డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడి రాజీనామాకు డిమాండ్ అనురాగ్ సింగ్ ఠాకూర్
    ప్రాథమిక దర్యాప్తు తర్వాత బ్రిజ్ భూషణ్ పై కేసు నమోదు చేస్తాం  సుప్రీంకోర్టు
    రెజ్లర్ల పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టు విచారణ  ప్రపంచం

    సుప్రీంకోర్టు

    తెలంగాణ హైకోర్టు ఆదేశాలను కొట్టేసిన సుప్రీంకోర్టు; అవినాష్ రెడ్డి అరెస్టుకు లైన్ క్లియర్  వైఎస్సార్ కడప
    సుప్రీంకోర్టు వర్సెస్ ప్రభుత్వం; పాకిస్థాన్‌లో ఆడియో క్లిప్ ప్రకంపనలు  పాకిస్థాన్
    Same Sex Marriage: స్వలింగ సంపర్కుల వివాహాన్ని చట్టబద్ధం చేసిన మొదటి దేశం ఏది?  డెన్మార్క్
     వైఎస్ వివేకా హత్య కేసు: అవినాష్‌రెడ్డి బెయిల్‌పై స్టే విధించిన సుప్రంకోర్టు  సీబీఐ
    తదుపరి వార్తా కథనం

    క్రీడలు వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    Sports Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023