
WFI అధ్యక్షుడికి వ్యతిరేకంగా మళ్లీ రోడ్డెక్కిన రెజ్లర్లు
ఈ వార్తాకథనం ఏంటి
భారత స్టార్ రెజ్లర్లు బజరంగ్, వినేశ్ ఫోగాట్, సాక్షి మాలిక్ WFI అధ్యక్షుడికి వ్యతిరేకంగా మళ్లీ రోడ్డెక్కిన నిరసన తెలియజేశారు.
మేరీకోమ్ కమిటీ నివేదిక బహిర్గతం చేసి, లైంగిక్ వేధింపులకు గురైన మహిళా రెజ్లర్లకు న్యాయం చేయాలంటూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రెజ్లర్లు నిరసన చేపట్టారు.
దేశానికి ఎన్నో పతకాలు సాధించిన మహిళా రెజ్లర్లపై లైగింక వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తు గత జనవరిలో రెజ్లర్లు కొన్ని రోజులు ధర్నాకు దిగిన విషయం తెలిసిందే.
మాజీ భారత రెజ్లింగ్ సమాఖ్య చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిబ్ భూషన్ శరణ్ సింగ్ గతంలో ఫిర్యాదు చేసినా పోలీసులు ఎఫ్ఆర్ నమోదు చేయలేదని మండిపడ్డారు.
Details
న్యాయం చేసేంతవరకు పోరాడుతాం
కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ వారితో చర్చలు జరిపి మేరీకోమ్ నేతృత్వంలో ఆరుగురు సభ్యుల కమిటీలో విచారణ చేసింది.
అయితే ఇటీవల కమిటీ నివేదిక క్రీడాశాఖకు ఇచ్చినా బహిర్గతం చేయకపోవడంతో రెజ్లర్లు రోడెక్కి నిరసన వ్యక్తం చేశారు.
తమకు న్యాయం జరిగే వరకూ తాము ఇక్కడే తిని, ఇక్కడే నిద్రపోతామని రెజ్లర్లు స్పష్టం చేశారు.