Page Loader
'నాటు నాటు' పాటకు స్టేప్పులేసిన సురేష్ రైనా, హర్భజన్
నాటు నాటు పాటకు స్టెప్పులేసిన హర్భజన్, రైనా

'నాటు నాటు' పాటకు స్టేప్పులేసిన సురేష్ రైనా, హర్భజన్

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 16, 2023
11:14 am

ఈ వార్తాకథనం ఏంటి

చిత్రం ఆర్ఆర్ఆర్‌లోని నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు లభించింది. ఎంతోమంది ఈ పాటకు స్టెప్పులు లేస్తూ నెట్టింట్లో సందడి చేస్తున్నారు. తాజాగా ఈ లిస్టులోకి టీమిండియా క్రికెటర్లు కూడా చేరారు. టీమిండియా మాజీ క్రికెటర్లు హర్భజన్ సింగ్, సురేష్ రైనా నాటు నాటు పాటకు స్టెప్పులేశారు. ప్రస్తుతం వారిద్దరు లెజెండ్స్ లీగ్ క్రికెట్ లో ఇండియా మహరాజాస్ టీమ్ కు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈ లీగ్ లో భాగంగా బుధవారం జరిగిన ఇండియా మహరాజాస్, వరల్డ్ జెయింట్స్ మధ్య మ్యాచ్ లో హర్భజన్ సింగ్, రైనా నాటు నాటు పాటకు అదిరిపోయే స్టెప్పులేశారు.

హర్భజన్ సింగ్

వరల్డ్ జెయింట్స్ చేతిలో ఇండియా మహరాజాస్ ఓటమి

ఈ వీడియోను లెజెండ్స్ లీగ్ ట్విట్టర్ పోస్టు చేయడంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ డ్యాన్స్ చూసిన అభిమానులు పొగడ్తలతో హర్భజన్, రైనాను ముంచెత్తారు. ఇదిలా ఉండగా.. ఈ మ్యాచ్ లో వరల్డ్ జెయింట్స్ చేతిలో ఇండియా మహరాజాస్ ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇండియా మహరాజాస్ 20 ఓవర్లలో 9 వికెట్లను కోల్పోయి 136 పరుగులను మాత్రమే చేసింది సురేష్ రైనా 41 బంతుల్లో మూడు సిక్సర్లు, రెండు ఫోర్ల సాయంతో 49 పరుగులు చేశారు. అనంతరం లక్ష్య చేధనకు దిగిన వరల్డ్ జెయింట్స్ తరుపున గేల్ 57 పరుగులు చేసి తన జట్టును గెలిపించుకున్నాడు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

స్టెప్పులేసిన హర్భజన్, రైనా