గంటల వ్యవధిలో అమ్ముడుపోయిన విశాఖ వన్డే మ్యాచ్ టికెట్లు
భారత్-ఆస్ట్రేలియా మధ్య ఈనెల 19న విశాఖలోని వైఎస్సార్ ఏసీఏ ఏడీసీఏ స్టేడియంలో రెండో వన్డే జరగనుంది. దీనికి సంబంధించిన వన్డే టికెట్లు గంటల వ్యవధిలోనే హాట్ కేకుల్లా అమ్ముడుపోయాడు. స్టేడియం సామర్థ్యం 27వేలు కాగా 70శాతం టికెట్లను పేటిఎం సంస్థ ఆన్‌లైన్‌లో విక్రయించింది. మిగిలిన 30శాతం టికెట్లను ఆఫ్‌లైన్‌లో మంగళవారం విక్రయించగా వాటిని కొనుగోలు చేసేందుకు క్రీడాభిమానులు ఎగబడ్డారు. పేటిఎం సంస్థ ఈనెల 10, 11, 12 తేదీల్లో రూ.600 నుంచి రూ. 6వేల వరకు వివిధ విభాగాల్లో 70శాతం టికెట్లను ఆన్‌లైన్‌లో విక్రయించిన విషయం తెలిసిందే.
19న విశాఖలో రెండో వన్డే
వైఎస్సార్ స్టేడియంతో పాటు మరో రెండు సెంటర్లో మంగళవారం 30శాతం టికెట్లను ఏసీఏ నిర్వాహక కమిటీ అందుబాటులో పెట్టింది. వీటి కోసం తెల్లవారుజాము నుంచే క్రికెట్ అభిమానులు క్యూ కట్టారు. దీంతో టికెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఆస్ట్రేలియాతో టీమిండియా తొలి వన్డేను 17వ తేదీన ముంబైలో ఆడనుంది. 19న విశాఖలో రెండో వన్డే, మూడో వన్డే 22న చెన్నైలో జరగనుంది.