ఆస్ట్రేలియాకు వన్డే సారిథిగా స్టీవ్ స్మిత్
మార్చి 17 నుంచి టీమిండియాతో ప్రారంభమయ్యే 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ ముందు ఆస్ట్రేలియాకు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ పాట్ కమిన్స్ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. ఇటీవలే తన తల్లి చనిపోవడంతో కమిన్స్ స్వదేశంలోనే ఉండిపోనున్నాడు. దీంతో ఆస్ట్రేలియాకు వన్డే సారిథిగా స్టీవ్ స్మిత్ బాధ్యతలను చేపట్టనున్నాడు. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా మంగళవారం ప్రకటించింది. పాట్ కమిన్స్ ను వన్డేలకు ఎంపిక చేయలేదని, తన తల్లి మరణం తర్వాత కోలుకోవడానికి కమిన్స్ కు కొంత సమయం ఇచ్చామని, ప్రస్తుతానికి వన్డేలకు కెప్టెన్‌గా స్టీవ్ స్మిత్‌ను ప్రకటించామని ఆస్ట్రేలియా ప్రధాన కోచ్ ఆండ్రూ మెక్ డొనాల్డ్ పేర్కొన్నారు.
భారత్‌తో వన్డే సిరీస్‌కు ఆస్ట్రేలియా జట్టు
టెస్టు సిరీస్ మధ్యలో గాయం కారణంగా స్వదేశానికి వెళ్లిన డేవిడ్ వార్నర్, దేశవాళీ టోర్ని ఆడేందుకు వెళ్లిన ఆస్టన్ అగర్ తిరిగి వన్డే జట్టులో చోటు సంపాదించుకున్నారు. ఆస్ట్రేలియా జట్టు: డేవిడ్ వార్నర్, ట్రవిస్ హెడ్, స్టీవ్ స్మిత్ (కెప్టెన్), మార్నస్ లబూషేన్, మిచెల్ మార్ష్, మార్కస్ స్టొయినిస్, అలెక్స్ క్యారీ, గ్లెన్ మ్యాక్స్‌వెల్, కెమరూన్ గ్రీన్, జోష్ ఇంగ్లిస్, సీన్ అబాట్, అస్టన్ అగర్, మిచెల్ స్టార్క్, నాథన్ ఇల్లిస్, ఆడమ్ జంపా