ధోనీ రిటైర్మెంట్ పై కీలక విషయాన్ని బయటపెట్టిన సురేష్ రైనా
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో చైన్నై సూపర్ కింగ్స్ అద్భుతంగా రాణిస్తోంది. ఇప్పటివరకూ ఆడిన 11 మ్యాచ్ ల్లో 6 గెలిచి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. ప్రస్తుతం చైన్నై సూపర్ కింగ్స్ జట్టు మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ గురించి తరుచూ భిన్నమైన ప్రశ్నలు ఎదురవుతున్నాయి. మాజీ క్రికెటర్లు, అభిమానుల్లో ఇది ముఖ్యమైన అంశంగా మారిపోయింది. అయితే తన రిటైర్మెంట్ పై ధోని ఇప్పటివరకూ నేరుగా స్పందించలేదు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
వచ్చే సీజన్లో కూడా ఆడనున్న ధోని?
మే 6న చిదంబర స్టేడియంలో సీఎస్కే, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ధోని, రైనా ఒకరిపై ఒకరు చేయి వేసుకొని మాట్లాడారు. అనంతరం రైనా జియోసినిమా ఛానల్ లో ఐపీఎల్ లో వ్యాఖ్యతగా సేవలందించాడు. అనంతరం ధోని రిటైర్మెంట్ గురించి మాట్లాడారు. ఈ సీజన్ లో ట్రోఫీని గెలిచి, వచ్చే సీజన్ లో కూడా ఆడతానని ధోని తనతో చెప్పాడని రైనా స్పష్టం చేశాడు. ధోనీ ఫీల్డింగ్, బ్యాటింగ్ విభాగంలో చక్కగా రాణిస్తున్నాడని, ఎంతోమంది ఆటగాళ్లు అతడిని చూసి నేర్చుకుంటున్నారని, రిటైర్మెంట్ అనేది ధోని తీసుకోవాల్సిన నిర్ణయమని రైనా వివరించాడు.