Suryakumar Yadav: ముస్తాక్ అలీ ట్రోఫీలో సూర్య విధ్వంసం.. అయినా భారత జట్టులో చోటు లేనట్టేనా?
ఈ వార్తాకథనం ఏంటి
భారత్‌కు టీ20 ప్రపంచకప్ అందించిన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ చరిత్రలో నిలిచిపోయాడు. అయితే, గత ప్రపంచకప్ తర్వాత నుంచి అతడికి టీమ్‌ఇండియాలో చోటు దక్కడం లేదు. ఫామ్ కోల్పోయి ఇబ్బందులు ఎదుర్కొన్న సూర్య.. తాజాగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో వరుస అర్ధశతకాలతో తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. దీంతో మళ్లీ జాతీయ జట్టులోకి వస్తాడా? అనే చర్చ మొదలైంది. అయితే, ప్రస్తుతం భారత జట్టులో తీవ్ర పోటీ ఉండటంతో అతడికి అవకాశం దక్కడం అంత సులభం కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా బీసీసీఐ వర్గాలు కూడా ఇదే విషయాన్ని వెల్లడించాయి.
వివరాలు
జట్టులో ఖాళీ లేదు.. యశస్వికే చోటు కరువు
ప్రస్తుతానికి సూర్యకుమార్ మా ఎంపిక ప్రణాళికల్లో లేడు. ఇప్పటికీ యశస్వి జైస్వాల్‌కు పరిమిత ఓవర్ల క్రికెట్ జట్టులో చోటు కల్పించలేకపోతున్నాం. సూర్య దేశవాళీ క్రికెట్‌లో బాగా ఆడుతున్నాడు.
అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ, ప్రస్తుత భారత జట్టులో అతడికి ఎక్కడ అవకాశం కల్పించాలన్నదే పెద్ద ప్రశ్న. ప్రస్తుతం జట్టులో ఎక్కడా స్థానం ఖాళీగా లేదు. మొదట్లో దూకుడుగా ఆడిన యశస్విని ఇప్పుడు టెస్టులకే పరిమితం చేయాల్సి వచ్చింది.
వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ ఆటతీరుతో యశస్విని పక్కన పెట్టాల్సి వచ్చింది. మిడిలార్డర్‌లోనూ తీవ్ర పోటీ నెలకొందని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి
వివరాలు
ముస్తాక్ అలీ ట్రోఫీలో సూర్య విధ్వంసం
మరోవైపు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో సూర్యకుమార్ తన బ్యాటింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. గత వారం హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 21 బంతుల్లోనే 60 పరుగులు చేశాడు.
ఆ తర్వాత గుజరాత్‌తో జరిగిన పోరులోనూ చెలరేగాడు. 29 బంతుల్లో 82 పరుగులు చేసి తన ఫామ్‌ను చాటాడు. ఈ ఇన్నింగ్స్‌తో ముంబయి జట్టు 199 పరుగుల లక్ష్యాన్ని కేవలం 15.4 ఓవర్లలోనే ఛేదించింది.
వరుసగా భారీ ఇన్నింగ్స్‌లు ఆడుతున్నప్పటికీ, భారత జట్టులో చోటు కోసం సూర్యకుమార్‌కు పోటీ ఎదురవుతోంది.
దేశవాళీ క్రికెట్‌లో రాణిస్తున్న అతడికి సెలక్టర్లు ఎప్పుడు అవకాశం కల్పిస్తారనేది ఆసక్తికరంగా మారింది.