LOADING...
Suryakumar Yadav: వన్డే రికార్డులు అస్సలు బాలేవు : సూర్యకుమార్ 
వన్డే రికార్డులు అస్సలు బాలేవు : సూర్యకుమార్

Suryakumar Yadav: వన్డే రికార్డులు అస్సలు బాలేవు : సూర్యకుమార్ 

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 09, 2023
06:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీ20ల్లో దుమ్మురేపే సూర్యకుమార్ యాదవ్ వన్డేల్లో మాత్రం చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నారు. ఇప్పటికే కొనిసార్లు అవకాశాలిచ్చినా వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. ఈ విషయంపై తాజాగా సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. వెస్టిండీస్‌తో ముగిసిన మూడో టీ20 తర్వాత సూర్యకుమార్ తన రికార్డులపై స్పందించాడు. ఈ మ్యాచులో సూర్య 83 పరుగులతో రాణించడంతో టీమిండియా 7 వికెట్లతో గెలుపొందింది. చాలా రోజుల తర్వాత సూర్య తనదైన స్టైల్‌లో రెచ్చిపోయాడు. తన వన్డే గణాంకాలు అస్సలు బాలేవని, ఈ విషయాన్ని చెప్పుకోవడానికి తానేమీ సిగ్గు పడాల్సిన పని లేదని, నిజాయతీ చాలా ముఖ్యమని సూర్యకుమార్ యాదవ్ చెప్పారు.

Details

వన్డేలపై దృష్టి పెట్టనున్న సూర్యకుమార్ యాదవ్

వన్డేలు ఆడటానికి ఎక్కువ ప్రాక్టీస్ చేయాలని రోహిత్ శర్మ, రాహుల్ ద్రావిడ్ సూచించారని, జట్టు కోసం ఆడి, అవకాశాలను అందిపుచ్చుకుంటానని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు. టీ20ల్లో సూర్యకుమార్ యాదవ్ రికార్డులు మెరుగ్గా ఉన్నాయి. 51 మ్యాచుల్లో 45.64 సగటుతో 1780 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, 14 హాఫ్ సెంచరీలను బాదాడు. 2022లో సూర్య ఐసీసీ టీ20 ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్నాడు. ఇప్పటివరకూ ఆడిన 26 వన్డేల్లో కేవలం 24.33 సగటుతో 511 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా సిరీస్‌లో వరుసగా మూడుసార్లు డకౌట్లు అయిన విషయం తెలిసిందే.